స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్.. పాత రికార్డును బద్దలు కొట్టిన బ్యాంక్ నిఫ్టీ.. లాభాల్లో ముగిసిన షేర్ మార్కెట్

Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 16) తీవ్ర ఒడిదుడుకుల మధ్య మిశ్రమంగా సాగినప్పటికీ, దిగ్గజ బ్యాంకింగ్ షేర్ల అండతో ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత తన పాత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపు స్థాయిని నమోదు చేసింది.

ఉదయం 25,206.15 వద్ద ప్రారంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ, ఇంట్రాడేలో 25,337.60 గరిష్ఠాన్ని, 25,172.10 కనిష్ఠాన్ని తాకి.. చివరకు 147 పాయింట్ల లాభంతో 25,291.10 వద్ద స్థిరపడింది. అదేవిధంగా బీఎస్ఈ సెన్సెక్స్ 512 పాయింట్లు ఎగబాకి 82,105 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 542 పాయింట్లు లాభపడి 61,576 వద్ద ముగియడం విశేషం. ఇది 2026 ఫిబ్రవరి 18న నమోదైన 61,551 రికార్డు స్థాయిని అధిగమించింది.

Sensex today Nifty today stock market closing bell Sensex gains 510 points Nifty 25291 FMCG stocks banking stocks Indian stock market market closing update stock market rally top gainers Dalal Street news November 16 2026 510 25291 FMCG

బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ముగిసినప్పటికీ.. విస్తృత మార్కెట్ చిత్రం మాత్రం భిన్నంగా ఉంది. లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించగా.. మధ్యస్థాయి కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో మిడ్‌క్యాప్ సూచీ 313 పాయింట్లు నష్టపోయింది. ప్రధాన బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లు మార్కెట్‌కు ప్రధాన మద్దతుగా నిలిచాయి.

మరోవైపు, ఏటీ-1 (AT-1) బాండ్ల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని కోరుతూ ఆర్‌బీఐ, ఇతర పక్షాలు సమీక్షా పిటిషన్ దాఖలు చేయడంతో యెస్ బ్యాంక్ షేరు సుమారు 3 శాతం లాభపడింది. బీమా రంగంలో శుక్రవారం నాటి ర్యాలీ కొనసాగుతూ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు 2 శాతం మేర పెరిగాయి. ఆసుపత్రి షేర్లలో మ్యాక్స్ హెల్త్‌కేర్ 6 శాతం దూసుకెళ్లగా, ఫోర్టిస్ హెల్త్‌కేర్ 4 శాతం నష్టపోయింది.

Also Read

అయితే, ఆటో, మెటల్, ఎలక్ట్రానిక్స్ రంగాల షేర్లు సోమవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేరు ఏకంగా 9 శాతం కుప్పకూలింది. ఆ సంస్థకు చెందిన బ్రిటిష్ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం, లాభాల మార్జిన్లు, నగదు ప్రవాహ అంచనాలను తగ్గించుకోవడమే ఇందుకు కారణం. మారుతి సుజుకి షేరు కూడా 2 శాతం క్షీణించింది. అంతర్జాతీయంగా లోహాల ధరలు తగ్గడంతో టాటా స్టీల్ 3 శాతం, హిండాల్కో 2 శాతం నష్టపోయాయి.

ఇక త్రైమాసిక ఫలితాలు, ఇతర కారణాలతో పలు మిడ్‌క్యాప్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో కేన్స్ టెక్నాలజీ షేరు 13 శాతం పడిపోయింది. ప్రమోటర్ గ్రూప్ వ్యక్తులు షేర్లను విక్రయించారన్న వార్తలతో లారస్ ల్యాబ్స్ 9 శాతం నష్టపోయింది. విక్రమ్ సోలార్ బలహీన ఫలితాల ప్రభావంతో ఇంధన రంగ షేర్లయిన ఇనాక్స్ విండ్, ప్రీమియర్ ఎనర్జీస్ 8 శాతం చొప్పున క్షీణించాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అంబర్ ఎంటర్‌ప్రైజెస్ 8 శాతం, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 6 శాతం మేర నష్టాలతో ముగిశాయి. మొత్తంమీద హెవీవెయిట్ బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్‌ను నిలబెట్టగా, మిడ్‌క్యాప్, ఆటో రంగాలు మదుపర్లను నిరాశపరిచాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+