స్టాక్ మార్కెట్ 2027లో భారీ పతనమా.. రయ్యిన దూసుకెళ్లడమా.. మోర్గాన్ స్టాన్లీ నివేదికను ఓ సారి చూడండి..

Morgan Stanley Stock Market Forecast: ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) భారత స్టాక్ మార్కెట్ భవిష్యత్తుపై తన తాజా అంచనాలను విడుదల చేసింది. నవంబర్ 15, 2026న విడుదల చేసిన '2027 ఇండియా ఈక్విటీ స్ట్రాటజీ అవుట్‌లుక్' నివేదికలో.. డిసెంబర్ 2027 నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ గమనానికి సంబంధించి మూడు వేర్వేరు దృశ్యాలను (Scenarios) విశ్లేషించింది.

ఈక్విటీ వ్యూహకర్తలు రిధమ్ దేశాయ్, నయంత్ పరేఖ్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. బేస్-కేస్ అంచనాలో సెన్సెక్స్ 95,000 పాయింట్ల స్థాయికి చేరుకుంటుందని నిర్దేశించింది. నవంబర్ 12 నాటి 81,911 రిఫరెన్స్ స్థాయితో పోలిస్తే ఇది 16 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ బేస్-కేస్ దృష్టాంతానికి 50 శాతం అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారితే 'బుల్ కేస్' (Bull Case) దృష్టాంతంలో సెన్సెక్స్ ఏకంగా 28 శాతం ఎగబాకి 1,05,000 పాయింట్ల శిఖరాన్ని తాకవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. దీనికి 30 శాతం అవకాశాన్ని కేటాయించింది.

Morgan Stanley Sensex target Sensex target 2027 Sensex 105000 Sensex 95000 Sensex 68000 bull case bear case base case Indian stock market forecast Sensex prediction stock market outlook Morgan Stanley India strategy Nifty 50 Indian equities 2027 1 05 95 68 50

ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే దిగువకు రావడం ద్వారా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం, ప్రభుత్వం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును (LTCG) సున్నాకు తగ్గించడం వంటి సంస్కరణలు తీసుకురావడం, ప్రపంచ ఏఐ వాణిజ్యం కుప్పకూలకుండా నిలదొక్కుకోవడం జరిగితే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో 2026 నుండి 2029 ఆర్థిక సంవత్సరాల మధ్య సెన్సెక్స్ కంపెనీల ఆదాయాలు ఏటా సగటున 20.3 శాతం చొప్పున వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. అయితే, పన్ను తగ్గింపు అనేది కేవలం తమ ఊహాజనిత అంచనా మాత్రమేనని, ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని నివేదిక స్పష్టం చేసింది.

Also Read

ఇక 50 శాతం అవకాశం ఉన్న 95,000 బేస్-కేస్ లక్ష్యానికి బలమైన దేశీయ ఆర్థిక వృద్ధి, స్థిరమైన ప్రపంచ విస్తరణ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావడం, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల లోపు కొనసాగడం వంటి అంశాలు మద్దతు ఇస్తాయని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. రిజర్వ్ బ్యాంక్ మరో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచినప్పటికీ.. మెరుగైన ద్రవ్య లభ్యత,నిలకడగా కొనసాగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తాయని, తద్వారా FY2029 వరకు కార్పొరేట్ ఆదాయాలు 18.1 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది.

మరోవైపు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే 'బేర్ కేస్' (Bear Case) దృష్టాంతంలో సెన్సెక్స్ 17 శాతం మేర పతనమై 68,000 పాయింట్లకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనికి 20 శాతం సంభావ్యత ఉందని పేర్కొంది. ముడిచమురు ధరలు నెలల తరబడి బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగితే.. స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు ఆర్‌బీఐ కఠిన ద్రవ్య చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, దీనికి తోడు ప్రపంచ ఆర్థిక మందగమనం తోడైతే కార్పొరేట్ ఆదాయాల వృద్ధి 15.8 శాతానికి పరిమితమై మార్కెట్లు కుదేలవుతాయని విశ్లేషించింది. ఈ మూడు దృశ్యాల ఆధారంగా సంభావ్యత-భారిత సెన్సెక్స్ లక్ష్యం 90,750గా ఉంది.

పెట్టుబడి వ్యూహాల విషయానికి వస్తే.. మోర్గాన్ స్టాన్లీ దేశీయ చక్రీయ రంగాలపై (Domestic Cyclicals) అత్యంత సానుకూలంగా ఉంది. వినియోగదారుల ఐచ్ఛిక వ్యయ రంగాలు (Consumer Discretionary), పారిశ్రామిక, ఆర్థిక రంగాలలో 'ఓవర్‌వెయిట్' వైఖరిని కొనసాగిస్తూ.. ఏఐ అవకాశాలతో ఐటీ సేవల రంగం లబ్ధి పొందుతుందని గుర్తించింది. అదే సమయంలో ఇంధనం, మెటీరియల్స్, యుటిలిటీస్, హెల్త్‌కేర్ రంగాలపై 'అండర్‌వెయిట్' వైఖరిని వ్యక్తం చేసింది. రాబోయే ఐదేళ్లలో భారత పెట్టుబడి-జీడీపీ నిష్పత్తి 37.5 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తూ.. దీర్ఘకాలంలో భారతీయ ఈక్విటీల వృద్ధి పట్ల తన విశ్వాసాన్ని చాటుకుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+