స్టాక్ మార్కెట్‌ క్లోజింగ్ బెల్.. ఇన్వెస్టర్లకు భారీ షాక్.. ఒక్కరోజే 989 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్..

Stock Market Closing Bell: వరుసగా నాలుగు వారాలుగా లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం (నవంబర్ 27, 2026) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే బలహీనంగా కదిలిన సూచీలు మధ్యాహ్నం సమయానికి భారీ పతనాన్ని చవిచూశాయి. ఉదయం 11:11 గంటలకు 150 పాయింట్లు తగ్గిన నిఫ్టీ, 11:30 గంటలకల్లా 200 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రమైంది.

ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 989 పాయింట్లు పతనమై 83,339 వద్ద స్థిరపడగా.. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 277 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ సైతం 494 పాయింట్లు క్షీణించి 63,041 వద్ద ముగిసింది. అయితే భారీ షేర్లు కుదేలైనప్పటికీ మిడ్‌క్యాప్ సూచీ 64 పాయింట్లుపెరిగి 61,846 వద్ద ముగియడం విశేషం. ఇదే సమయంలో విదేశీ మారకపు ద్రవ్య మార్కెట్లో భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 55 పైసలు బలహీనపడి 92.99 వద్ద ముగిసింది.

Stock Market Today November 27 2026 Sensex today Nifty today Sensex falls 989 points Nifty loses 277 points Indian stock market crash stock market highlights market sell-off Sensex closing bell Nifty closing update four key market developments Dalal Street news 27 989 277

మార్కెట్ భారీ పతనానికి ప్రధానంగా నాలుగు కారణాలు దోహదపడ్డాయని చెప్పవచ్చు. మొదటిది ఏంటంటే హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్లు, సౌదీ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 97 డాలర్లు దాటి ఈ వారంలోనే 4.2 శాతం ఎగబాకడం ప్రపంచవ్యాప్తంగా సరఫరా భయాలను రేకెత్తించింది.

Also Read

రెండవది ఏంటంటే.. గత నాలుగు వారాలలో మార్కెట్ దాదాపు 15 శాతం పెరగడంతో పాటు గత రెండు సెషన్లలోనూ లాభపడటంతో మదుపర్లు గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

మూడవది గత నాలుగు సెషన్లలో సుమారు 8 శాతం లాభపడిన నిఫ్టీ ఐటీ సూచీ శుక్రవారం 1.5 శాతం క్షీణించడం బెంచ్‌మార్క్ సూచీలపై తీవ్ర ఒత్తిడి పెంచింది.

ఇక నాల్గవది, పెరుగుతున్న ముడిచమురు ధరలు, ఈక్విటీ మార్కెట్ల బలహీనత కారణంగా రూపాయి విలువ క్రమంగా క్షీణించడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

రంగాలు, షేర్ల వారీగా పరిశీలిస్తే శుక్రవారం మార్కెట్లో భిన్న ధోరణులు కనిపించాయి. నవంబర్ నెల వాహన అమ్మకాల గణాంకాలు అక్టోబర్‌తో పోలిస్తే బలహీనంగా ఉండవచ్చన్న అంచనాలతో ఆటో రంగంలో బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్ భారీగా నష్టపోగా, శ్రీరామ్ ఫైనాన్స్ తన పతనాన్ని కొనసాగిస్తూ దాదాపు 4 శాతం క్షీణించింది. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ 2 నుండి 3 శాతం మేర తగ్గగా.. మోరయ్యా యూనిట్‌కు సంబంధించిన పూర్తి స్పందన లేఖ వార్తలతో జైడస్ లైఫ్‌సైన్సెస్ 3 శాతం, ముడి పదార్థాల ధరల ఒత్తిడితో ఎఫ్‌ఎంసీజీ సూచీ 1 శాతం పడిపోయాయి.

దీనికి విరుద్ధంగా రక్షణ రంగంలో సోలార్ ఇండస్ట్రీస్, భారత్ డైనమిక్స్ షేర్లు 7 శాతం చొప్పున ఎగబాకగా.. విదేశీ ఆర్డర్ల వార్తలతో గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ 7 శాతం, కోఫోర్జ్ 4 శాతం, గోల్డ్ లోన్ సంస్థలు మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ 2 నుండి 3 శాతం లాభాలతో రాణించాయి. జూపిటర్ లైఫ్‌లైన్ హాస్పిటల్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్, రేమండ్, జస్ట్ డయల్ కూడా లాభపడిన మిడ్‌క్యాప్ కంపెనీలలో నిలిచాయి.

మొత్తంగా చూసినట్లయితే నవంబర్ 23 నుండి 27 వరకు సాగిన ఈ వారంలో (గురు పర్వ కారణంగా మంగళవారం మార్కెట్ సెలవు) శుక్రవారం నాటి భారీ పతనం గత నాలుగు వారాల వరుస ర్యాలీకి అడ్డుకట్ట వేసింది. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీ అర శాతానికి పైగా నష్టపోగా, మెటల్, బ్యాంకింగ్ సూచీలు 2 నుండి 4 శాతం మేర క్షీణించాయి. నిఫ్టీ 50 లోని 32 కంపెనీలు నష్టాల్లో ముగియగా టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయాయి.

అయితే గత రెండు వారాల క్షీణత తర్వాత ఐటీ సూచీ ఈ వారంలో సుమారు 5 శాతం లాభపడి దాదాపు రెండు నెలల్లోనే అతిపెద్ద వారపు పుంజుకోవడాన్ని నమోదు చేసింది. వారపు టాప్ ఐదు నిఫ్టీ గెయినర్లలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా నిలవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+