నకిలీ బ్యాంక్ గ్యారెంటీ కేసుతో ముడిపడి ఉన్న మీడియా నివేదికలపై స్పష్టతనిచ్చిన తర్వాత రిలయన్స్ పవర్ లిమిటెడ్ (Reliance Power Ltd) షేర్లు సోమవారం రోజున 7.80 శాతం వరకు పెరిగి ట్రేడయ్యాయి. కంపెనీ ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొంది. దాంతో ఇన్వెస్టర్ల నమ్మకం కొంత పునరుద్ధరించబడింది.అమర్ నాథ్ దత్తా కంపెనీతో ఎటువంటి సంబంధం కలిగి లేరు. ఈ కేసుకు కంపెనీ లేదా దాని వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వాటాదారులు లేదా ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ ప్రకటన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల అమర్ నాథ్ దత్తాను అరెస్టు చేసిన వార్తల నేపథ్యంలో వచ్చింది. ఆ వ్యక్తి పేరును కొందరు మీడియా సంస్థలు రిలయన్స్ పవర్‌తో అనుసంధానించడంతో కంపెనీ ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కంపెనీ, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ NU BESS లిమిటెడ్, అలాగే ఉద్యోగులు ఎల్లప్పుడూ నిజాయితీగా వ్యవహరించారు. మేము మోసం లేదా కుట్రలో భాగస్వాములు కాదు, ఈ ఘటనలో మేము బాధితులమేనని రిలయన్స్ పవర్ పేర్కొంది.

అంబానీపై వచ్చిన నివేదికలపై స్పందించిన రిలయన్స్ పవర్.. తన ప్రమోటర్ అనిల్ డి. అంబానీ గురించి మీడియా చేసిన తప్పు సూచనలను కూడా ఖండించింది.ఈ విషయంలో అనిల్ డి. అంబానీని తప్పుగా అనుసంధానించారు. ఆయన గత 3.5 సంవత్సరాలుగా రిలయన్స్ పవర్ బోర్డులో లేరని కంపెనీ స్పష్టం చేసింది.
మరోవైపు, ED మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అనిల్ అంబానీ గ్రూప్‌కి చెందిన కంపెనీల ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ప్రకటించింది.ఈ ఆస్తుల్లో నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ (DAKC)లోని 32 ఎకరాల భూమి కూడా ఉంది.దీని మొత్తం విలువ రూ. 4,462 కోట్లుగా అంచనా వేయబడింది.
ఈ చర్యలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCom), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) కంపెనీలకు సంబంధించిన బ్యాంక్ మోసాలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఉన్నాయి. ఈ అటాచ్‌మెంట్‌లతో కలిసి ED చేత అటాచ్ చేయబడిన అనిల్ అంబానీ కంపెనీల ఆస్తుల మొత్తం విలువ రూ. 7,500 కోట్లు దాటింది.
ED ప్రకారం.. ముంబై, ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, పూణే, థానే, హైదరాబాద్, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో మొత్తం 42 ఆస్తులను కవర్ చేస్తూ ఐదు తాత్కాలిక అటాచ్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. వీటిలో నాలుగు ఆదేశాలు అక్టోబర్ 31న,మరొకటి నవంబర్ 4న జారీచేయబడ్డాయి.
ఈ మొత్తం పరిణామాల మధ్య కంపెనీ స్పష్టత ఇన్వెస్టర్లకు కొంత సానుకూల సంకేతాన్ని ఇచ్చింది. 2025 సెప్టెంబర్ నాటికి రిలయన్స్ పవర్ ప్రమోటర్లు కంపెనీలో 24.98 శాతం వాటా కలిగి ఉన్నారు. స్టాక్ మార్కెట్లో ఈ క్లారిఫికేషన్‌ను ఇన్వెస్టర్లు పాజిటివ్ సిగ్నల్‌గా తీసుకోవడంతో షేర్ ధరలు దూసుకుపోయాయి.ఏదేమైనా ఈ క్లారిఫికేషన్‌తో రిలయన్స్ పవర్ తన ఇమేజ్‌ను కాపాడుకోవడంలో కీలక అడుగు వేసింది. అలాగే ఇన్వెస్టర్ల విశ్వాసం నిలబెట్టుకోవడంలో సఫలమైంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications