Reliance Infrastructure Shares: కిందపడిన వాడు ఏదో ఒక రోజున ఓపిక కూడగట్టుకుని తిరిగి పైకి లేస్తాడు అనే సామెత అనిల్ అంబానీ విషయం నిజంగా జరిగింది. వ్యాపారవేత్తగా పతనంతో దశాబ్ధాలుగా మీడియాలో కనిపించని ఆయన పేరు ప్రస్తుతం తరచుగా వినిపిస్తోంది. కమ్ బ్యాక్ స్టోరీ చాలా బలంగా కొనసాగుతున్న వేళ అనిల్ ఒక్కొక్కటిగా తన కంపెనీల రుణాలను తిరిగి చెల్లించి తిరిగి కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ గురించే. అనిల్ అంబానీ నేతృత్వంలో కొనసాగుతున్న కంపెనీ తన ఇన్వెస్టర్లకు మరోసారి శుభవార్తను ప్రకటించింది. తాజాగా నవంబర్ 27న కంపెనీ అనుబంధ సంస్థ JR టోల్ రోడ్ ప్రైవేట్ లిమిటెడ్(JRTR) రూ.271.18 కోట్ల రుణాలను తిరిగి చెల్లించడానికి యెస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీనికింద రుణాన్ని తిరిగి చెల్లించటానికి మార్గం సుగమం అయ్యింది. ఈ ఒప్పందం రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రుణ విముక్తులను చేయనుందని వెల్లడైంది. ఎందుకంటే ఈ రుణాల వ్యవహారంలో రిలయన్స్ ఇన్‌ఫ్రా కార్పొరేట్ గ్యారెంటర్‌గా ఉంది. అలాగే ఇకపై రిలయన్స్ ఇన్ ఫ్రా రుణానికి గ్యారెంటర్‌గా బాధ్యత వహించదు.

రుణాల చెల్లింపు ప్రకటన రావటంతో నిన్న ఇంట్రాడేలో కంపెనీ షేర్లపై బుల్స్ కన్నుపడింది. దీంతో స్టాక్ పై బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్లు ముందుకురావటంతో స్వల్ప లాభాల్లో ముగింపును చూసింది. అయితే నేడు ఇంట్రాడేలో స్టాక్ పనితీరును పరిశీలిస్తే ఉదయం 11.15 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు ధర రూ.274.30 వద్ద కొనసాగుతోంది. అలాగే ప్రస్తుతం కంపెనీ తన కొత్త ప్రాజెక్టులను సైతం ప్రకటించింది. మహారాష్ట్రలోని రత్నగిరిలో పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, చిన్న ఆయుధాల తయారీ కోసం అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సదుపాయాన్ని నెలకొల్పడానికి రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన ప్రణాళికను ప్రకటించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ వాటాడ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 1000 ఎకరాల ధీరూభాయ్ అంబానీ డిఫెన్స్ సిటీ(DADC)లో భాగంగా కొనసాగుతోంది.
100 శాతం పెరిగిన కంపెనీ లాభాలు..
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. నికర అమ్మకాలు ఏడాది ప్రాతిపధికన 67 శాతం పెరిగి రూ.359.7 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే క్రమంలో నికర లాభం సైతం 100 శాతానికి పైగా పెరిగి రూ.69.8 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.10,000 కోట్లకు పైగా ఉంది. కంపెనీలో ప్రమోటర్ల వాటా 16.5 శాతం వద్ద ఉండగా.. ఎఫ్‌ఐఐలు 8.38 శాతం, డీఐఐలు 1.40 శాతం, ప్రభుత్వం 0.02 శాతం హోల్డ్ చేస్తున్నారు. అయితే అత్యధిక వాటాను పబ్లిక్ వద్ద అత్యధికంగా 73.70 శాతం వద్ద కొనసాగుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications