అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) భారతదేశంలో ప్రాథమిక సమర్పణ (IPO) ద్వితీయ లిస్టింగ్ (secondary listing) అవకాశాలను చురుగ్గా పరిశీలిస్తోంది. భారతదేశంలో గణనీయమైన ఉద్యోగులను కలిగి ఉన్న ఈ కంపెనీ, దేశీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యూహాన్ని అవలంబిస్తోంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్ Q3 2025 ఆదాయాల కాల్ సందర్భంగా మాట్లాడుతూ.. కాగ్నిజెంట్ బోర్డు, మేనేజ్‌మెంట్ బృందం వాటాదారుల విలువను పెంచే మార్గాలను నిరంతరం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో IPO, ద్వితీయ లిస్టింగ్ అవకాశాలను మా చట్టపరమైన, ఆర్థిక సలహాదారులతో కలిసి అంచనా వేస్తున్నామని వెల్లడించారు.
దలాల్ వివరించిన వివరాల ప్రకారం ప్రాథమిక సమర్పణ (Primary Offering) ద్వారా కంపెనీ కొత్త షేర్లను విడుదల చేసి కొత్త మూలధనాన్ని సేకరిస్తుంది, తద్వారా కంపెనీ వాటా మూలధనాన్ని పెంచుతుంది. ఇక ద్వితీయ లిస్టింగ్ (Secondary Listing) ద్వారా ఇప్పటికే జారీ చేసిన షేర్లను మరో మార్కెట్‌లో విక్రయించడం జరుగుతుంది. NASDAQలో ఇప్పటికే లిస్టెడ్ అయిన కాగ్నిజెంట్, ఈ ద్వితీయ లిస్టింగ్ ద్వారా భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో కూడా తన షేర్లను అందుబాటులోకి తెచ్చి.. భారత పెట్టుబడిదారులలో దృశ్యమానత (visibility)ను పెంచడమే కాకుండా మార్కెట్ లిక్విడిటీని కూడా పెంచుతుంది.

భారతదేశంలో విదేశీ కంపెనీ ప్రాథమిక ఆఫర్, ద్వితీయ లిస్టింగ్ చేయడం అనేది సంక్లిష్టమైన, బహుళ దశల ప్రక్రియ అని CFO జతిన్ దలాల్ తెలిపారు. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్ అని పేర్కొంటూ ఇప్పటికీ ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ అంశాలు వంటి వాటిపై ఆధారపడి భవిష్యత్‌లో ఈ నిర్ణయం తీసుకుంటాం. వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం మా ప్రధాన లక్ష్యం అని అన్నారు.
న్యూజెర్సీ రాష్ట్రంలోని టీనెక్ (Teaneck) ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్, 2025 మూడవ త్రైమాసికంలో (Q3) నికర లాభం 53 శాతం పడిపోయి USD 274 మిలియన్లకు చేరిందని వెల్లడించింది. ఈ తగ్గుదలకి ప్రధాన కారణం USD 390 మిలియన్ల ఒక సారి నగదు రహిత ఆదాయపు పన్ను వ్యయం (non-cash tax expense) అని కంపెనీ తెలిపింది. అయితే, కంపెనీ ఆదాయాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 7.3% పెరిగి USD 5.415 బిలియన్లకు చేరాయి. ఈ వృద్ధికి ప్రధాన కారణంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో కంపెనీ పెట్టుబడులు, డిజిటల్ సేవల విస్తరణ అని CFO పేర్కొన్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజాలకు పోటీగా ఇచ్చే అవకాశం అయితే ఉంది.
జూలై-సెప్టెంబర్ 2025 కాలంలో కాగ్నిజెంట్ మొత్తం 6 వేల మంది కొత్త ఉద్యోగులను, ముఖ్యంగా ఫ్రెషర్లను చేర్చుకుంది. దీంతో త్రైమాసికం చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,49,800కి చేరింది. భారతదేశంలో ఉన్న ఉద్యోగులే ఈ సంఖ్యలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నారని కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో IT రంగం వేగంగా పెరుగుతున్నదని, అలాగే పెట్టుబడిదారుల ఆసక్తి అధికంగా ఉందని కాగ్నిజెంట్ అంచనా వేస్తోంది. దేశంలో లిస్టింగ్ ద్వారా కంపెనీకి మరింత బ్రాండ్ విశ్వసనీయత, పెట్టుబడిదారుల చేరిక, మార్కెట్ ప్రాప్యత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications