స్టాక్ మార్కెట్‌ని కుదిపేసిన టాటా స్టీల్–APL అపోలో ఒప్పందం.. రెండు కంపెనీల వ్యూహాలు ఏంటంటే..

APL Apollo-Tata Steel Mega Deal: దేశీయ ఉక్కు రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన టాటా స్టీల్ (Tata Steel)- ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ (APL Apollo Tubes) మధ్య కుదిరిన రెండు-దశల మెగా ఒప్పందం స్టాక్ మార్కెట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. నవంబర్ 23, సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఈ రెండు కంపెనీల షేర్లు భారీ అమ్మకాల సునామీలో చిక్కుకున్నాయి.

ఇంట్రాడేలో ఏపీఎల్ అపోలో షేరు ఒక దశలో దాదాపు 20 శాతం మేర కుప్పకూలి.. ఆ తర్వాత 16 శాతం నష్టంతో రూ. 1,788 వద్ద ట్రేడవుతూ ఈ ఏడాది ఆరంభం నుండి చూస్తే నష్టాల్లోకి జారుకుంది; మరోవైపు టాటా స్టీల్ షేరు సైతం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 9 శాతం పతనమై.. 6.5 శాతం నష్టంతో రూ. 167 వద్ద కదలాడింది. ఈ భారీ ఒప్పందానికి నిధుల సమీకరణ, అప్పుల భారం, అధిక వాల్యుయేషన్, సరఫరా గొలుసులో రాబోయే మార్పులపై మదుపర్లలో తలెత్తిన ఆందోళనలే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

APL Apollo Tata Steel deal Tata Steel APL Apollo acquisition APL Apollo mega M amp amp A deal 5825 crore deal APL Apollo Tubes acquisition news Tata Steel acquisition strategy APL Apollo share price Tata Steel share price steel sector M amp amp A impact of acquisition on stocks Tata Steel business expansion APL Apollo investors APL APL 5825 APL APL

ఈ ఒప్పందం ప్రకారం టాటా స్టీల్ సంస్థ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రమోటర్ల నుండి 26.38 శాతం వాటాను రూ. 15,510.6 కోట్ల పూర్తి నగదు లావాదేవీ ద్వారా కొనుగోలు చేయనుండగా.. పబ్లిక్ వాటాదారుల నుండి తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ద్వారా ఒక్కో షేరు రూ. 2,301.40 ధరతో (గత శుక్రవారం ముగింపు ధర కంటే ఎక్కువ) మరో 26 శాతం వాటాను (రూ. 16,756 కోట్లు) సమీకరించనుంది.

మూడు విడతల్లో సాగే ఈ ప్రక్రియలో మొదటి విడతగా సోమవారం జరిగిన బ్లాక్ డీల్ ద్వారా దాదాపు 10 శాతం (9.91%) వాటా సుమారు రూ. 5,500-5,825 కోట్లకు చేతులు మారగా.. మిగిలిన రెండు విడతలు నియంత్రణ సంస్థల ఆమోదాల అనంతరం 2028 మార్చి 31 నాటికి పూర్తి కానున్నాయి. దీనికి ప్రతిగా.. ఏపీఎల్ అపోలో సంస్థ టాటా స్టీల్ యొక్క స్టీల్ ట్యూబ్స్ వ్యాపారాన్ని, కలర్-కోటెడ్ స్టీల్ (టాటా స్టీల్ కలర్స్) వ్యాపారాన్ని రూ. 28 వేల కోట్ల వరకు వెచ్చించి కొనుగోలు చేయనుంది.

Also Read

అయితే ఇంత భారీ మొత్తాన్ని ఏపీఎల్ అపోలో ఎలా సమీకరిస్తుందనేదే మార్కెట్‌కు అతిపెద్ద ఆందోళనగా మారిందని ఆనంద్ రాఠీ (Anand Rathi) నివేదిక స్పష్టం చేసింది; అక్విజిషన్ ఫైనాన్సింగ్ ద్వారా నిధులు సేకరిస్తే కంపెనీపై అప్పుల భారం ఏ స్థాయికి చేరుతుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు టాటా స్టీల్ విషయానికొస్తే.. సెప్టెంబర్ 2026 నాటికే కంపెనీ నికర రుణం రూ. 91,423 కోట్లుగా ఉండగా, ఏపీఎల్ అపోలోలో నియంత్రణ వాటా కోసం రూ. 32,266 కోట్లు వెచ్చించడం దాని బ్యాలెన్స్ షీట్‌పై స్వల్పకాలిక ఒత్తిడిని పెంచుతుందని చోళ సెక్యూరిటీస్ పేర్కొంది. సాంప్రదాయ ఉక్కు కంపెనీలు సింగిల్ డిజిట్ EV/EBITDA మల్టిపుల్స్ వద్ద ట్రేడ్ అవుతుండగా, FY27 అంచనాల ప్రకారం 27 నుండి 28 రెట్ల (ఇంప్లైడ్ మల్టిపుల్ 24.8x) అత్యధిక వాల్యుయేషన్ వద్ద ఈ ఒప్పందం కుదరడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

దీనిపై బ్రోకరేజీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిటీ (Citi) గ్రూపు.. టాటా స్టీల్‌కు 'సెల్' రేటింగ్ ఇవ్వగా.. ఎంకే (Emkay) 'బై' రేటింగ్ ఇచ్చింది. మదుపర్లు ఒక్కరోజు పతనానికి భయపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. ఏపీఎల్ అపోలో నిధుల సమీకరణ ప్రణాళికలను, టాటా స్టీల్ అప్పు-మార్జిన్ల గమనాన్ని నిశితంగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా ధర పెరిగినప్పుడు ఏపీఎల్ అపోలో నుండి వైదొలగవచ్చని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరోవైపు ప్రమోటర్ సంజయ్ గుప్తా ఏపీఎల్ అపోలో నుండి నిష్క్రమించిన తర్వాత.. టాటా స్టీల్ మాతృసంస్థగా మారితే కంపెనీకి ఉన్న వినియోగదారుల తరహా (Consumer-like) ప్రీమియం వాల్యుయేషన్ కొనసాగుతుందా లేక సాధారణ ఉక్కు అనుబంధ సంస్థగా విలువ కట్టబడుతుందా అన్నది కీలక ప్రశ్నగా మారింది. గుప్తా నిష్క్రమణ నేపథ్యంలో.. ఆయన ప్రమోటర్ గ్రూప్ కింద ఉన్న మరో రెండు లిస్టెడ్ సంస్థలైన ఎస్‌జీ మార్ట్ (SG Mart) (మార్కెట్ విలువ సుమారు రూ. 14,000 కోట్లు, ప్రమోటర్ వాటా 57.88%), ఎస్‌జీ ఫిన్‌సర్వ్ (SG Finserve) (మార్కెట్ విలువ రూ. 5,500 కోట్లు, ప్రమోటర్ వాటా 56.95%) పైకి మదుపర్ల దృష్టి మళ్లింది.

ప్రమోటర్లు ఈ భారీ నగదును వాటిపై కేంద్రీకరిస్తారన్న అంచనాతో శుక్రవారం 9 శాతం పెరిగిన ఎస్‌జీ మార్ట్ షేర్లు, సోమవారం గరిష్ఠ స్థాయిల నుండి తీవ్ర ఒడిదుడుకులకు (15 శాతం వరకు క్షీణత) లోనయ్యాయి. నిధుల సమీకరణ ప్రతిపాదనపై ఎస్‌జీ మార్ట్ బోర్డు ఈ వారం చివరలో సమావేశం కానుంది.

చివరగా ఈ యాజమాన్య మార్పు దేశీయ ఉక్కు సరఫరా గొలుసులో పెను మార్పులకు దారితీయనుంది. దేశంలోనే అతిపెద్ద హాట్ రోల్డ్ కాయిల్స్ (HRC) వినియోగదారు అయిన ఏపీఎల్ అపోలో ఇకపై తన మాతృసంస్థ టాటా స్టీల్ నుండే ముడిసరుకును సేకరించే అవకాశం ఉన్నందున.. ఇప్పటివరకు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel), ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (AM/NS India) సంస్థలకు అమ్మకాల పరిమాణం తగ్గే ముప్పు పొంచి ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+