బ్లాక్ డీల్ ఎఫెక్ట్.. 20 నిమిషాల్లో రూ. 8 వేల కోట్లు ఔట్.. కుప్పకూలిన APL అపోలో, టాటా స్టీల్ షేర్లు..

Stock Market Today: దేశీయ ఉక్కు రంగంలో సంచలనం సృష్టిస్తూ టాటా స్టీల్ (Tata Steel), ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ (APL Apollo Tubes) మధ్య కుదిరిన రూ. 32,266 కోట్ల భారీ వ్యూహాత్మక ఒప్పందం స్టాక్ మార్కెట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వారాంతంలో (నవంబర్ 21, 22) వెలువడిన ఈ ప్రకటన తర్వాత సోమవారం (నవంబర్ 23, 2026) మార్కెట్ ప్రారంభం కాగానే ఈ రెండు కంపెనీల షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురై 'క్యాజువాలిటీ ఆఫ్ ది డే'గా నిలిచాయి.

ఒకానొక దశలో ఏపీఎల్ అపోలో షేరు 14 శాతం మేర పడిపోయింది. టాటా స్టీల్ షేరు కూడా దాదాపు 6 శాతం మేర క్షీణించింది. ఈ భారీ పతనం కారణంగా సుమారు 20 నిమిషాల్లోనే ఏపీఎల్ అపోలో మార్కెట్ విలువ దాదాపు రూ. 8,000 కోట్లు తగ్గిపోయింది.

మునుపటి సెషన్‌లో రూ. 2,121.60 వద్ద ముగిసిన ఏపీఎల్ అపోలో షేరు సోమవారం రూ. 1,955 వద్ద బలహీనంగా ప్రారంభమై, తొలి ట్రేడింగ్‌లోనే 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి, ఒకానొక దశలో 14 శాతం మేర పతనమై రూ. 1,810 కనిష్ఠ స్థాయికి జారిపోయింది.

APL Apollo Tubes share price APL Apollo stock crash APL Apollo shares fall 15 Tata Steel share price Tata Steel shares fall 6 5825 crore block deal APL Apollo block deal Tata Steel block deal acquisition news steel stocks today Indian stock market news APL Apollo latest news APL APL APL 15 6 5825 APL

ఇదే సమయంలో ఏపీఎల్ అపోలోకు చెందిన సుమారు 2.77 కోట్ల షేర్లు (మొత్తం ఈక్విటీలో దాదాపు 10 శాతం) ఒక్కో షేరు రూ. 2,100 చొప్పున రూ. 5,825 కోట్ల బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారాయి. మరోవైపు టాటా స్టీల్ షేరు సైతం తన మునుపటి ముగింపు ధర రూ. 178 నుండి రూ. 173.70 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 4 నుండి 6 శాతానికి పైగా క్షీణించి రూ. 166-169 స్థాయిలకు పడిపోయింది.

ఈ మెగా డీల్ నిర్మాణం రెండు ప్రధాన భాగాలుగా.. పరస్పరం ముడిపడి ఉంది. మొదటి భాగంలో, టాటా స్టీల్ సంస్థ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రమోటర్ గ్రూప్ సంస్థ అయిన 'ఎస్ గుప్తా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్' నుండి 26.38 శాతం వాటాను (7.39 కోట్ల షేర్లు) ఒక్కో షేరు రూ. 2,100 చొప్పున రూ. 15,511 కోట్లకు (మూడు విడతలుగా) కొనుగోలు చేయనుంది. టేకోవర్ నిబంధనల ప్రకారం, పబ్లిక్ వాటాదారుల నుండి అదనంగా 26 శాతం వాటా కోసం ఒక్కో షేరు రూ. 2,301.40 ధరతో ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.

Also Read

ఇందుకు గరిష్ఠంగా రూ. 16,756 కోట్లు వెచ్చించనుంది. మొత్తం రూ. 32,266 కోట్ల ఈ పెట్టుబడి పూర్తయిన తర్వాత ఏపీఎల్ అపోలోలో టాటా స్టీల్ వాటా గరిష్ఠంగా 52.38 శాతానికి చేరుకుని కొత్త ప్రమోటర్‌గా అవతరిస్తుంది. ప్రస్తుత ప్రమోటర్లు పబ్లిక్ షేర్‌హోల్డర్లుగా మారుతారు. రెండవ భాగంలో టాటా స్టీల్ తన రెండు డౌన్‌స్ట్రీమ్ వ్యాపారాలను ఏపీఎల్ అపోలోకు విక్రయించనుంది. ఇందులో ట్యూబ్స్ అండ్ పైప్స్ వ్యాపారాన్ని రూ. 11,700 కోట్లకు (స్లంప్ సేల్ పద్ధతిలో), గతంలో టాటా బ్లూస్కోప్ స్టీల్‌గా పిలిచిన 'టాటా స్టీల్ కలర్స్'లోని 100 శాతం వాటాను రూ. 16,300 కోట్లకు కలిపి మొత్తం రూ. 28,000 కోట్లకు ఏపీఎల్ అపోలో కొనుగోలు చేయనుంది.

ఈ వ్యూహాత్మక కలయిక ద్వారా తమ డౌన్‌స్ట్రీమ్ ఇంటిగ్రేషన్ 35 శాతం నుండి 53 శాతానికి పెరుగుతుందని, 14 బ్రాండ్లు, 5,000కు పైగా ఎస్‌కేయూలు (SKUs) తమ పోర్ట్‌ఫోలియోలోకి చేరడం వల్ల అధిక లాభదాయకత కలిగిన విలువ ఆధారిత ఉత్పత్తులలో అగ్రగామిగా నిలుస్తామని టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్, సీఎఫ్ఓ కౌశిక్ ఛటర్జీ పేర్కొన్నారు. 2035 నాటికి ఉమ్మడి డౌన్‌స్ట్రీమ్ సామర్థ్యాన్ని 15.5 మిలియన్ టన్నులకు (MTPA) తీసుకెళ్లడమే లక్ష్యమని వారు వివరించారు.

అయితే, నియంత్రణ సంస్థల ఆమోదాల అనంతరం మార్చి 31, 2028 నాటికి పూర్తి కానున్న ఈ లావాదేవీలపై జేఎం ఫైనాన్షియల్ (JM Financial) కీలక విశ్లేషణ అందించింది. సెప్టెంబర్ 2026 నాటికి టాటా స్టీల్ నికర అప్పు రూ. 91,423 కోట్లుగా ఉండగా.. వ్యాపారాల విక్రయం ద్వారా వచ్చే రూ. 28,000 కోట్లు ఈ అప్పులో సుమారు 31 శాతానికి సమానమని తెలిపింది. అయినప్పటికీ, ఏపీఎల్ అపోలో కొనుగోలుకు టాటా స్టీల్ రూ. 32,266 కోట్లు చెల్లించాల్సి ఉండటం, ఈ రెండు లావాదేవీల నికర నగదు ప్రవాహాలు ఎలా సమతుల్యమవుతాయన్న సందేహాలు మదుపర్లను కలవరపెట్టాయి. ఈ ఒప్పందానికి నిధుల సమీకరణ, విలువ నిర్ధారణ (Valuation), వాటాదారులపై ప్రభావంపై స్పష్టతనిచ్చేందుకు ఇరు కంపెనీల యాజమాన్యాలు ఈ సాయంత్రం ప్రత్యేక పత్రికా సమావేశం నిర్వహించనున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+