Reliance Power Shares: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు అనిల్ అంబానీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. కొత్త సంవత్సరం ఆయన లిస్టెడ్ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మంచిరోజులు కొనసాగుతాయని తాజా పరిణామాల ద్వారా వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో అనిల్ అంబానీ పేరు తిరిగి భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని కొనసాగిస్తోంది.
తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర కంపెనీ మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని సాసన్ పవర్ లిమిటెడ్ బ్రిటన్ కి చెందిన IIFCLకి తాజాగా 150 మిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించినట్లు ప్రకటించింది. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ రూ.1286 కోట్లుగా ఉంది. కంపెనీ డిసెంబర్ 31, 2024 నాటి రుణనిబద్ధకు అనుగుణంగా చెల్లింపులను నెరవేర్చినట్లు కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను స్టాక్ మార్కెట్లతో జనవరి 1న కంపెనీ పంచుకుంది. తాజా పరిణామాలు కంపెనీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయటంతో పాటు విశ్వసనీయతను పెంచుతుందని తెలిపింది. పైగా కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు సఫలికృతం అవుతాయని కంపెనీ పేర్కొంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ససన్ పవర్ మధ్యప్రదేశ్‌లోని ససన్‌లో 3,960 మెగావాట్ల అత్యాధునిక పవర్ ప్లాంట్ నిర్వహిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ కావటం గమనార్హం. ఈ మెగా పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ , దిల్లీ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీ దాదాపు 14 డిస్ట్రిబ్యూటర్లకు ఒక్కో యూనిట్ విద్యుత్ రూ.1.54 చొప్పున సరఫరా చేస్తుందని తెలుస్తోంది. దేశంలోనే అతితక్కువ ధరకు సరఫరా చేయనున్న విద్యుత్ దాదాపు 40 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చనుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో రిలయన్స్ పవర్ తన రుణ చెల్లింపులను కొనసాగించటం రెన్యూవబుల్ ఎనర్జీ రంగంవైపు దృష్టి సారించేందుకు దోహపడుతోందని తెలుస్తోంది. జీరో డెట్ కంపెనీగా మారిన రిలయన్స్ పవర్ ఇటీవల ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ-లింక్డ్ వారెంట్ల ద్వారా రూ.1,525 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. వీటిని రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో అవకాశాలను వినియోగించుకోవటానికి ఉపయోగించుకోవాలని చూస్తోంది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ వరుసగా వివిధ కంపెనీల రుణాలను చెల్లించుకుంటూ ముందుకు సాగటం ఆయన పునరాగమనానికి సంకేతంగా చెప్పుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల్లో అనిల్ అంబానీ లిస్టెడ్ కంపెనీలపై నమ్మకాన్ని పెంచుతూ పెట్టుబడులను కొనసాగించటానికి దోహదపడుతుందని తెలుస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications