Reliance Power Shares: ప్రస్తుతం అంబానీ టైం తిరిగి వచ్చింది. వరుసగా అనిల్ అంబానీకి సానుకూలమైన వార్తలు రావటంతో దశాబ్ధాలుగా మిన్నకుండిపోయిన వ్యాపారవేత్త, సైలెంట్ గా విజయం దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. నిల్ తన కంపెనీల రుణాలను వేగంగా చెల్లిస్తూ క్రమేపీ కొత్త వ్యాపార వెంచర్లలోకి అడుగుపెడుతున్నారు. ఇది అంబానీ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉన్న ఇన్వెస్టర్ల మదిలో కొత్త ఆశలను చిగురింపచేస్తోంది.
ఈ క్రమంలో రిలయన్స్ పవర్ కంపెనీ సంస్థ రిలయన్స్ పవర్‌కి దిల్లీ హైకోర్టు నుంచి భారీ ఉపశమనం లభించిందని తెలుస్తోంది. దీని తర్వాత ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేసేందుకు రష్ మెుదలైంది. దీంతో రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లలో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో స్టాక్ 5 శాతానికి పైగా పెరిగి రూ.40.19 వద్ద ఉంది. దీనికి ముందు మార్చి 2024లో రూ.19.37 వద్ద ఉన్న ఒక్కో షేరు ధర అక్టోబర్ 4, 2024 నాటికి రూ.53.64 స్థాయికి పెరిగింది. నేడు కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 4.93 శాతం లాభంతో ఒక్కోటి రూ.40 వద్ద తమ ప్రయాణాన్ని ముగించాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,280 కోట్లుగా ఉంది.

వాస్తవానికి క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI) నిర్ణయంపై దిల్లీ హైకోర్టు స్టే ఇవ్వటం అనిల్ అంబానీకి రిలీఫ్ ఇచ్చింది. వాస్తవానికి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను అనిల్ అంబానీ కంపెనీ ఇస్తోందంటూ కొన్ని రోజుల కిందట మూడేళ్ల పాటు రిలయన్స్ పవర్ కంపెనీ సోలార్ ప్రాజెక్టుల బిడ్డింగ్ లో పాల్గొనకుండా నిషేధించిన సంగతి తెలిసిందే. బ్యాటరీ స్టోరేజ్ కాంట్రాక్టుల కోసం అనిల్ అంబానీ కంపెనీ బిడ్‌కు మద్దతుగా నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించారనే ఆరోపణలతో నిషేధం విధించబడిన సంగతి తెలిసిందే. రిలయన్స్ NU BESS ఫిలిప్పీన్స్‌లోని మనీలా సిటీ, మనీలాలో ఉన్న తన యూనిట్ ద్వారా ఫస్ట్‌రాండ్ బ్యాంక్ జారీ చేసిన బ్యాంక్ గ్యారెంటీని డిపాజిట్ చేసింది. ఈ వ్యవహారంలో జరిగిన దర్యాప్తులో బ్యాంక్ భారతీయ శాఖ ఫిలిప్పీన్స్‌లో తమకు శాఖ లేదని తెలిపింది. దీంతో బ్యాంక్ గ్యారెంటీ నకిలీదిగా SECI పరిగణించింది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ పవర్ కంపెనీ రూ.2,878.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు ఏడాది కాలంలో 160 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం కంపెనీ షేర్ల వెనుక ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోలు కోసం పరిగెడుతున్నారు. కంపెనీ ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా రూ.1,524.60 కోట్లను సమీకరించేందుకు ఇన్వెస్టర్లు ఆమోదం పొందటమే. కంపెనీ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్ ద్వారా వెల్లడించింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మెజారిటీతో ప్రతిపాదన ఆమోదం పొందింది. 99.5% వాటాదారులు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ రైజ్ చేయటానికి అనుకూలంగా ఓటు వేశారు. దీని ప్రకారం ఒక్కో షేరును రూ.33 చొప్పున 46.20 కోట్ల సమాన సంఖ్యలో ఈక్విటీ షేర్ల కన్వర్టిబుల్ వారెంట్ల ద్వారా రూ.1,524.60 కోట్ల వరకు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications