Tech Mahindra Job: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యువత ఎక్కువగా ఐటీ ఉద్యోగం కోసమే బీటెక్ చేస్తున్నారు. ప్రధానంగా తెలుగు ప్రజలు మంచి ఆదాయవనరుగా భావిచంటంతో పాటు సమాజంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అధిక గౌరవం దక్కటం కూడా చాలా మందిని ఈ రంగంలో ఉపాధి పొందేందుకు ప్రేరేపిస్తోంది.
ఐటీ బూమ్ ప్రధానంగా ఉపయోగించుకున్న వారిలో తెలుగు ప్రజలు కూడా ముందు వరుసలోనే ఉన్నారు. చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడగా.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాదు కూడా ఐటీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారుతున్న వేళ ఇక్కడ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా హైదారాబాదులో డాట్‌నెట్, ఫుల్‌స్టాక్ లీడ్ కోసం నియామకాన్ని చేపడుతోంది. దీనికోసం కంపెనీ 7 నుంచి 10 సంవత్సరాలు వర్క్ అనుభవం కలిగి ఉండాలని వెల్లడించింది. ఎంపికైన ఉద్యోగికి రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల ఆఫర్ చేస్తోంది. అయితే ఉద్యోగి బాధ్యతల్లో భాగంగా దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను అభివృద్ధి, మెరుగుపరచటం, నిర్వహించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
బాధ్యతలను పరిశీలిస్తే.. ప్రాజెక్ట్ అవసరాలను అర్థం చేసుకుని అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలుగా అనువదించడానికి క్రాస్-ఫంక్షనల్ బృందాలు, వ్యాపార వాటాదారులతో పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే స్కేలబుల్, హై క్వాలిటీ సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను రూపొందించడానికి, అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు సాఫ్ట్‌వేర్ లోపాలను సకాలంలో పరిష్కరించాల్సి ఉంటుందని టెక్ మహీంద్రా వెల్లడించింది. టార్గెట్ కి అనుకూలంగా సకాలంలో పూర్తి చేసేందుకు ఉద్యోగి కట్టుబడి ఉండాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
అయితే ఉద్యోగం కోసం అప్లై చేసుకునే వ్యక్తులు WPF, .Net 4.x, Web API, WCFతో పనిచేసిన అనుభవం తప్పనిసరిగా కంపెనీ పేర్కొంది. అలాగే ఎస్క్యూఎల్ సర్వర్ పై పనిచేసిన అనుభవం తప్పనిసరిగా కంపెనీ పేర్కొంది.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications