Hyderabad IT Jobs: ఐటీ పరిశ్రమ ప్రస్తుతం తిరిగి పుంజుకుంటున్న వేళ చాలా కంపెనీలు తమ కంపెనీల్లోని ఖాళీలను ప్రస్తుతం ఫిల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక కంపెనీలు హైదరాబాద్ లో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నందుకు కొత్త ఉద్యోగ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మెగా ప్యాకేజీలతో జాబ్ కోసం వెతికే వారికి ఇప్పుడు సరైన అవకాశం అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది Shell Infotech సంస్థ పోస్ట్ చేసిన జాబ్ ఓపెనింగ్ గురించే. కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, గురుగ్రామ్, చెన్నై, కలకత్తాల్లో వర్క్ చేసేందుకు అనుకూలంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో Purview/Zscalerపై అనుభవం కలిగిన DLP సీనియర్ కన్సల్టెంట్ కోసం వెతుకుతున్నట్లు ప్రకటించింది. హైబ్రిడ్ వర్క్ విధానంగా ఉన్న జాబ్ పొందటానికి కనీసం 5-8 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం అవసరమని ప్రకటించింది. అలాగే అనుభవాన్ని బట్టి వార్షిక వేతనాన్ని 9.5-16 లక్షల వరకు చెల్లిస్తామని వెల్లడించింది.

పర్వ్యూ లేదా జెడ్‌స్కాలర్ ఉపయోగించి DLP సొల్యూషన్‌ల అమలు, కాన్ఫిగరేషన్ కోసం డిజైన్ బృందం - క్లయింట్ ఇంజనీరింగ్ బృందం మధ్య ప్రాథమిక సాంకేతిక అనుసంధానకర్తగా వ్యవహరించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే DLP పరిష్కారాలను ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలలో అనుసంధానించడానికి ఐటీ, సెక్యూరిటీ, కంప్లయన్స్ సహా క్రాస్-ఫంక్షనల్ బృందాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది.
DLP హెచ్చరికలు, సంఘటనలను పర్యవేక్షించడంతో పాటు విశ్లేషించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాటిపై సకాలంలో ప్రతిస్పందించటం, పరిష్కార చర్యలకు సాంకేతిక మద్దతును అందించాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే ఫైనల్ వినియోగదారులకు, వాటాదారులకు సాంకేతిక శిక్షణ, సపోర్ట్ అందించాలని కంపెనీ వెల్లడించింది. DLP సాంకేతికతలు, సైబర్ సెక్యూరిటీ ముప్పుల్లో తాజా పోకడలు, పురోగతులపై ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని పేర్కొంది.
ఇక విద్యార్హతల విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ అవసరమని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే DLP పరిష్కారాలను ప్రత్యేకంగా పర్వ్యూ లేదా Zscalerలో అమలు చేయడం, నిర్వహించడంలో కనీసం రెండేళ్ల పనిచేసిన అనుభవం కలిగి ఉండాలని వెల్లడించింది. ఇదే క్రమంలో అద్భుతమైన విశ్లేషణాత్మక, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నష్టాలను సమర్థవంతంగా గుర్తించి తగ్గించగల సామర్థ్యాలను అభ్యర్థులు కలిగి ఉండాలని సూచించింది. ఇది ఐటీ సెక్యూరిటీకి సంబంధించిన రోల్ కేటగిరీ కిందకు వస్తుంది.
ఈ జాబ్ రోల్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications