ఇండియాలోని ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024-25ని విడుదల చేసింది, వీటిలో 13735 జనరల్ కాగా మిగిలినవి బ్యాక్‌లాగ్‌గా ఉన్నాయి. అలాగే అభ్యర్థులు SBI క్లర్క్ నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సిలబస్, పరీక్ష వివరాలు, అప్లికేషన్ ఫార్మ్, అర్హత ఇతర సమాచారాన్ని అఫీషియల్ సైట్లో చెక్ చేయవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టుల క్రింద అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటుంది. ఎస్బిఐ భారతదేశం మొత్తంగా 14191 పోస్టులు ప్రకటించింది, వాటిలో 13735 జనరల్, మిగిలినవి 456 బ్యాక్‌లాగ్. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే https://bank.sbi/web/careers/current-openings లేదా https://www.sbi.co.in/web/careers/current-openings. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ 07 జనవరి 2025 వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం ఓపెనింగ్స్ లో తెలంగాణకి 139, ఆంధ్రప్రదేశ్కి 50 కేటాయించారు.

20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉతీర్ణులైన గ్రాడ్యుయేట్లు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల సెలక్షన్ ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ఆధారంగా ఉంటుంది.
ఎస్బిఐ క్లర్క్ పరీక్ష తేదీ
ఎస్బిఐ రిక్రూట్‌మెంట్ కోసం SBI క్లర్క్ దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకి ఫిబ్రవరి 2024లో తాత్కాలికంగా నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు ఉంటుంది. ఇందులో అర్హత పొందిన అభ్యర్థులకి మార్చి/ఏప్రిల్ 2025లో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
విద్యా అర్హత
*గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
*ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్‌లు ఉన్న అభ్యర్థులు IDD ఉత్తీర్ణత తేదీ 31 డిసెంబర్ 2024న లేదా అంతకుముందు ఉండాలి.
*గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదివే వారు కూడా తాత్కాలికంగా అప్లయ్ చేసుకోవచ్చు, తాత్కాలికంగా ఎంపికైతే డిసెంబర్ 31న లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఫ్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అర్హత వయస్సు
*కనీస వయస్సు 20 సంవత్సరాలు
*గరిష్ట వయస్సు - 01.04.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు
SBI క్లర్క్ జీతం
*రూ.24050 నుండి మొదలవుతుంది
SBI క్లర్క్ సెలక్షన్ ప్రక్రియ
*ప్రిలిమినరీ పరీక్ష
*మెయిన్స్ పరీక్ష
*లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్
*SBI క్లర్క్ ప్రీ ఎగ్జామ్ ప్యాటర్న్
పరీక్షా వ్యవధి: 1 గంట
మొత్తం ప్రశ్నలు: 100
మొత్తం మార్కులు: 100
కవర్ చేసే సబ్జెక్టులు: ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ
గమనిక: ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
మెయిన్స్ పరీక్షా
పరీక్షా వ్యవధి: 2 గంటల 40 నిమిషాలు
మొత్తం ప్రశ్నలు: 190
మొత్తం మార్కులు: 200
సబ్జెక్టులు: జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్.
ఎస్బిఐ క్లర్క్ ఫలితాలు
ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఫలితాలు విడుదల చేస్తారు. అభ్యర్థులు బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications