ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులకు మంచి అవకాశం. తాజాగా
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీల రిక్రూట్‌మెంట్ కోసం బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్ అంటే rrbapply.gov.inలో జనవరి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జనవరి 7న ఇప్పటికే మొదలయ్యాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేది 6 ఫిబ్రవరి 2025. అయితే అప్లికేషన్లో ఏదైనా మార్పులు ఉంటే 09 నుండి 18 ఫిబ్రవరి 2025 వరకు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), సైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్, జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ), సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్ (మహిళ), ప్రైమరీ రైల్వే టీచర్ (PRT), అసిస్టెంట్ టీచర్ (మహిళ) (జూనియర్ స్కూల్), లేబొరేటరీ అసిస్టెంట్/ స్కూల్ & ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ మరియు మెటలర్జిస్ట్) పోస్టుల కోసం మొత్తం 1036 ఖాళీలు భర్తీ చేయనుంది.

విద్యా అర్హత:
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) - సంబంధిత సబ్జెక్టులో PG అండ్ B.Ed.
శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) - గ్రాడ్యుయేట్ పాసై B.Edతో పాటు CTET అర్హత ఉండాలి.
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) - PT/ BPEdలో గ్రాడ్యుయేట్
జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ) - ఇంగ్లీష్/హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ - గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్/ అడ్వాట్./ జర్నలిజం/ మాస్ కమ్.
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ - డిప్లొమా ఇన్ లేబర్ లేదా సోషల్ వెల్ఫేర్ లేదా లేబర్ లాస్/ LLB/ PG లేదా MBA ఇన్ HR
లేబొరేటరీ అసిస్టెంట్/ - సైన్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అలాగే 1-సంవత్సర అనుభవం ఉండాలి.
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్) - సైన్స్ & DMLT డిప్లొమా/ సర్టిఫికెట్‌తో 12వ తరగతి పాసై ఉండాలి.
వయో పరిమితి:
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) వయసు: 18-48
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) వయసు : 18-48
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) వయసు: 18-48
జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ)వయసు: 18-36
సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ వయసు:18-36
స్టాఫ్ అండ్ వెల్ ఫెర్ ఇన్‌స్పెక్టర్ వయసు: 18-33
లేబొరేటరీ అసిస్టెంట్/ స్కూల్ వయసు: 18-48
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ & మెటలర్జిస్ట్): 18-33
సెలెక్షన్ ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
స్కిల్స్ టెస్ట్ (అవసరమైతే )
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్.
అప్లికేషన్ ఫీజు:
జనరల్/OBC/EWS: రూ. 500
SC/ST/PWD/మహిళలు/మాజీ సైనికులు: రూ. 250
ఈ నోటిఫికేషన్ కోసం అప్లయ్ చేసుకోవడానికి అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అప్‌డేట్‌ల కోసం అఫీషియల్ RRB వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో కన్ఫర్మ్ చేసుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications