IT News: హైదరాబాదీలకు టెక్ కంపెనీ ఆఫర్.. రూ.20 లక్షల ప్యాకేజీ ఆఫర్, కేవలం నలుగురికే ఛాన్స్..
NTT Data Jobs: దేశంలోని టాప్ టెక్ కంపెనీలు తమ హైదరాబాద్ వ్యాపారాల విస్తరణపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కూడా టెక్ కంపెనీలు బెంగళూరు కంటే హైదరాబాదు విస్తరణకు మెుగ్గు చూపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే అనేక టెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారీ వార్షిక ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ లేటరల్ ఎంట్రీ పొజిషన్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీ రిక్రూట్మెంట్ గురించే. కంపెనీ ప్రస్తుతం కంపెనీ అల్లెగ్రో సపోర్ట్ అనలిస్ట్ పొజిషన్ కోసం నియామకాలను ప్రారంభించింది. టెక్ సంస్థ దీనికోసం కనీసం 6 నుంచి 10 ఏళ్లు వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఉద్యోగులు కావాలని వెల్లడించింది.

కంపెనీ ఈ రోల్ కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబైలలో పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించింది. మెుత్తంగా నాలుగు పొజిషన్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడిస్తూనే వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగికి వార్షిక ప్యాకేజీని రూ.15-20 లక్షల వరకు ఆఫర్ చేస్తోంది. అల్లెగ్రో సపోర్ట్ స్పెషలిస్ట్‌లుగా ఆచరణాత్మకంగా ఉండండి వినియోగదారు సమస్యల క్లిష్టతను అర్థం చేసుకుని తగిన పరిష్కారాలు అందించటానికి బాధ్యత వహించాలని కంపెనీ వెల్లడించింది. గ్లోబల్ సపోర్ట్ ఇష్యూల్లో ఉద్యోగి పాల్గొనాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న NTT డేటా బృందానికి స్పష్టమైన, వృత్తిపరమైన కమ్యూనికేషన్‌లను అందించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించటానికి యాక్టివ్ గా సాంకేతిక సలహాదారులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎనర్జీ-కమోడిటీ పరిశ్రమల వ్యాపారంపై పూర్తి అవగాహన అవసరమని పేర్కొంది. అలాగే విద్యుత్, గ్యాస్, చమురు వ్యాపారాలపై కూడా పరిజ్ఞానం అవసరమని వెల్లడించింది.
బిజినెస్ అండ్ IT వాటాదారులకు సాంకేతిక పరిష్కారాలను తెలియజేసే సామర్థ్యం అవసరం. బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు, వివరాలపై శ్రద్ధ. డైనమిక్ ప్రెజెంటేషన్ నైపుణ్యాలు, ఇతరులకు శిక్షణ ఇచ్చే/ప్రభావితం చేసే సామర్థ్యం రోల్ కింద చాలా కీలకమని కంపెనీ వెల్లడించింది. అల్లెగ్రో సపోర్ట్ అనలిస్ట్ టీమ్ సభ్యుడు APAC ప్రాంతంలోని ఎనర్జీ & యుటిలిటీస్ బృందం గ్లోబల్ కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీల పోర్ట్‌ఫోలియోకు సేవలను అందిస్తోందని కంపెనీ జాబ్ రోల్ గురించి వెల్లడించింది. కంపెనీ వెల్లడించిన రోల్ కోసం ఆసక్తి కలిగి వ్యక్తులు జాబ్ కోసం నేరుగా కంపెనీని కూడా సంప్రదించవచ్చు. అలాగే ఉద్యోగానికి ఏదైనా గ్రాడ్యుయేషన్ అర్హత సరిపోతుందని కంపెనీ పేర్కొంది.
పైన పేర్కొన్న జాబ్ రోల్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications