నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.70 వేల జీతంతో 44 NABARD ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అలాగే ఈ ఏడాది బయటకు వచ్చిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు కూడా శుభవార్త. రూ. 70 వేల జీతంతో మీ కోసం ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) దేశంలోని నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశాన్ని అందిస్తోంది. NABARD యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ 2025-26 కింద ఖాళీల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విధాన రూపకల్పన, సాంకేతిక రంగాల్లో ఆసక్తి ఉన్న యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పొచ్చు.
ఈ యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్ద స్థాయి ప్రాజెక్టులు, పాలసీ రీసెర్చ్, వ్యూహాత్మక ప్రణాళికలపై పని చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో నేరుగా పాలుపంచుకునే అవకాశం ఈ ప్రోగ్రామ్ ద్వారా కలగనుంది.
NABARD ఈ నియామకానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను కూడా ప్రకటించింది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 26, 2025
చివరి తేదీ: జనవరి 12, 2026

ఈ గడువు తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నియామకం ద్వారా మొత్తం 44 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ముంబైలోని NABARD ప్రధాన కార్యాలయంలో లేదా దేశవ్యాప్తంగా ఉన్న NABARD ప్రాంతీయ కార్యాలయాలలో పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది.
ప్రధానంగా ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి:
వాతావరణ చర్యలు (Climate Action)
డేటా సైన్స్
సైబర్ సెక్యూరిటీ
పబ్లిక్ రిలేషన్స్
ఇతర సాంకేతిక, వ్యూహాత్మక విభాగాలు
అభ్యర్థుల వయోపరిమితి విషయానికొస్తే.. నవంబర్ 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. విద్యార్హతలు పోస్టు ఆధారంగా మారుతాయి. సాధారణంగా ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, డేటా సైన్స్, ఐటీ, పబ్లిక్ పాలసీ, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో డిగ్రీ లేదా పీజీ చేసిన వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఈ యంగ్ ప్రొఫెషనల్ నియామకం మొదటగా ఒక సంవత్సరం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. పనితీరు బాగుంటే దీన్ని గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ. 70 వేలు స్టైఫండ్ రూపంలో అందిస్తారు.
NABARD ఎంపిక ప్రక్రియ అనేక దశల్లో జరుగుతుంది. మొదట అభ్యర్థుల విద్యార్హతలు, పని అనుభవం, ప్రొఫైల్ ఆధారంగా స్క్రీనింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌కు పిలుస్తారు. చివరగా వైద్య ఫిట్‌నెస్ ప్రమాణాలు పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కింది విధంగా ముందుకెళ్లాలి:
1. NABARD అధికారిక వెబ్‌సైట్ nabard.org సందర్శించండి
2. Young Professional Programme 2025-26 లింక్‌పై క్లిక్ చేయండి
3. ఆన్‌లైన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపండి
4. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
5. ఆన్‌లైన్ ఫీజు చెల్లించండి
6. దరఖాస్తు సమర్పించిన తర్వాత స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేసుకోండి
NABARD యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ 2025-26 నిరుద్యోగ యువతకు కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లే అద్భుత అవకాశంగా చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో ప్రతిష్ఠాత్మక అనుభవం పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి.


Click it and Unblock the Notifications