RRB Group D Recruitment: దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు నిరంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని చూస్తూ అందుకోసం ముమ్మరంగా సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలు గ్రూప్ డి కింద ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రూప్ డి తాజా నోటిఫికేషన్ పరిశీలిస్తే లెవెల్ 1 కింద 32,438 ఉద్యోగాల భర్తీకి దేశంలోని యువ ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్లికేషన్స్ జనవరి 23, 2025 నుంచి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తుదారులు ఫిబ్రవరి 22. 2025 వరకు అప్లికేషన్స్ సమర్పించటానికి చివరి గడువుగా ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు ప్రకటించిన అర్హతలను పరిశీలిస్తే.. 10వ తరగతి పాస్ అయి ఉండాలని కంపెనీ ఉండాలని పేర్కొంది. అలాగే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పొంది ఉండాలన అర్హతను ప్రకటించింది. అలాగే దరఖాస్తు కోసం వయో పరిమితిని 18 నుంచి 36 ఏళ్లుగా నిర్ణయించింది.

ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనరల్, OBC, EWS అభ్యర్థులకు అప్లికేషన్ రుసుము రూ.500గా బోర్డు నిర్ణయించింది. ఇదే క్రమంలో SC, ST, PH, అన్ని కేటగిరీ మహిళల కోసం రుసుమును రూ. 250గా నిర్ణయించబడింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో కనిపించిన తర్వాత తిరిగి చెల్లించబడుతుంది. దరఖాస్తుదారులు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పద్ధతులను వినియోగించుకోవచ్చు. ఇకపోతో పరీక్షా సరళిని పరిశీలిస్తే ముందుగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-1) ఉంటుంది. దీని తర్వాత టెస్ట్ క్లియర్ చేసిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటాయి. ప్రస్తుతం రైల్వే బోర్డు పరీక్షా తేదీలను, ఫలితాల ప్రకటన తేదీలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. దరఖాస్తు పూరించటానికి వెళ్లే అభ్యర్థులు ఇటీవలి ఫోటో, స్కాన్ చేసిన సంతకం, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, చెల్లుబాటు అయ్యే ID రుజువు వంటి సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
కంప్యూటర్ పరీక్షల్లో జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు, మ్యాథ్స్ 25 ప్రశ్నలు, జనరల్ ఇండెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగటివ్ మార్కులు ఉంటాయని గుర్తుచుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్ డి రిక్రూట్మెంట్ కింద.. ఇందులో ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో 5058 పాయింట్స్‌మన్-బి పోస్టులపై రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్) 799 పోస్టులు, అసిస్టెంట్ (బ్రిడ్జ్), ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్ 301 పోస్టులు ఉన్నాయి. IV కోసం 13187 ఖాళీలు, అసిస్టెంట్ P-వే కోసం 247 ఖాళీలు ఉంటాయి. అదేవిధంగా మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ) 2587, అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్) 420, అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెకానికల్) 3077 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌అండ్‌టి అసిస్టెంట్ (ఎస్‌అండ్‌టి) కోసం 2012 మందిని, అసిస్టెంట్ టిఆర్‌డి కోసం 1381 మందిని నియమించనున్నారు. ఈ విభాగంలో అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) 950, అసిస్టెంట్ ఆపరేషన్ (ఎలక్ట్రికల్) 744, అసిస్టెంట్ టీఎల్ & ఏసీ 1041, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్‌షాప్) 624 పోస్టుల భర్తీ జరుగుతోంది. కాబట్టి తగిన విద్యార్హతలు కలిగిన వ్యక్తులు ఈ సదవాకాశాన్ని ఉపయోగించుకోవాలి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications