HCLTech Jobs: ఇటీవలి కాలంలో వరుసగా దేశంలోని ఐటీ సేవల కంపెనీలు కొత్తగా రిక్రూట్మెంట్లను చేపడుతున్నాయి. ఈ క్రమంలో టాప్ టెక్ కంపెనీలు వరుసగా నియామకాలను చేపట్టడంపై హైదరాబాద్ టెక్కీలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక వేతనం కోసం ఎదురుచూస్తున్న టెక్కీలకు హెచ్‌సిఎల్ శుభవార్త చెప్పింది.
ప్రస్తుతం టెక్ దిగ్గజం హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ హైదరాబాద్, పూణే, బెంగళూరుకు, కోయంబత్తూర్ SAP TM టెక్నికల్ కన్సల్టెంట్(SAP TM+ ABAP) పాత్ర కోసం ఉద్యోగుల నియమాకాలు చేపడుతున్నట్లు పోస్ట్ విడుదల చేసింది. ఇది పూర్తిగా హైబ్రిడ్ వర్క్ విధానంలో కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం అభ్యర్థులు ఎంపికైన తర్వాత వారానికి కేవలం 3 రోజులు ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ రోల్ కింద ఈ నియామకం ఉంది.

ఇక్కడ కంపెనీ విద్యార్హతల విషయంలో ఏదైనా గ్రాడ్యుయేటన్ పూర్తి చేసి ఉండాలని పేర్కొంది. అలాగే 30 రోజులు నోటీసు పరియడ్ ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు పేర్కొంది. పైన పేర్కొన్న పాత్రకు కంపెనీ 3 పోస్టులు ఉన్నట్లు కంపెనీ నోటిపై చేసింది. అనుభవజ్ఞులైన టెక్కీలకు రోల్ కోసం రూ.17 నుంచి 20 లక్షలు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి కంపెనీ నిన్న దీనికి సంబంధిని ఓపెనింగ్ విడుదల చేయగా టెక్కీల నుంచి భారీగా స్పందనతో పాటు దరఖాస్తులు వస్తున్నాయి. ఇది పూర్తిగా ఫుల్ టైం వర్క్ అని కంపెనీ పేర్కొంది. అలాగే 3-6 ఏళ్ల అనుభవం ఉన్న టెక్కీలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
టెక్ కంపెనీకి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే 59 దేశాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న కంపెనీ ప్రస్తుతం 2.18 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ ప్రధానంగా డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్ అండ్ ఏఐ వంటి టెక్నాలజీలపై పనిచేస్తోంది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, టెక్నాలజీ అండ్ సర్వీసెస్, టెలికాం అండ్ మీడియా, రిటైల్ అండ్ CPG, పబ్లిక్ సర్వీసెస్ వంటి రంగాల్లోని కంపెనీలకు సేవలను అందిస్తోంది.
ప్రధానంగా హైదరాబాద్ టెక్ కంపెనీలకు కొత్త గమ్యస్థానంగా మారిన వేళ అనేక కంపెనీలు ఈ నగరంలోని టెక్కీలను రిక్రూట్ చేసుకునేందుకు ప్రాధాన్యం అందిస్తున్నాయి. ప్రధానంగా SAPపై ఇటీవలి కాలంలో అనేక ఓపెనింగ్స్ పడుతున్నాయి. ఎక్కువ అనుభవం కలిగిన టెక్కీలకు కంపెనీలు ఈ క్రమంలో అవకాశం కల్పిస్తున్నాయి. హైదరాబాద్ ఫైనాన్స్ రంగంలోని కంపెనీలకు డెస్టినేషన్ గా మారిన వేళ ప్రస్తుత రిక్రూట్మెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ జాబ్ పోపెనింగ్ కి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications