Cognizant News: చాలా మంది ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో కొత్త ఉద్యోగాల వేటకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో లేటరల్ ఎంట్రీకి సంబంధించిన ఉద్యోగ ఆఫర్లు మార్కెట్లో పెరుగుతున్నాయి. ప్రధానంగా హై పెయిడ్ ప్యాకేజీలతో సాంకేతిక నిపుణుల కోసం కంపెనీలు తమ వేటను కొనసాగిస్తున్నాయి. అయితే హైదరాబాదులో ఉద్యోగం కోసం వెతుకుతున్న టెక్కీలకు ప్రస్తుతం ఒక శుభవార్త ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ విడుదల చేసిన జాబ్ ఆఫర్ గురించే. కంపెనీ స్యాప్ SAP ABAP/ ABAP HANA కన్సల్టెంట్ కోసం వెతుకుతున్నట్లు జాబ్ పోర్టల్ లో ఆఫర్ ప్రకటించింది. వాస్తవానికి ఇది సీనియర్ అసోసియేట్ లేదా మేనేజర్ స్థాయి ఉద్యోగం. ప్రముఖ సంస్థలో పనిచేసిన గత అనుభవం కనీసం 6 నుంచి 11 ఏళ్లు ఉండాలని కంపెనీ ఈ క్రమంలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ రోల్ కోసం ఒక ఓపెనింగ్ ఉందని వెల్లడించిన కంపెనీ దీనికి హైబ్రిడ్ వర్గ్ విధానం వింద వెసులుబాటును కల్పించింది. అలాగే జాబ్ రోల్ కోసం రూ.15 లక్షల నుంచి రూ.27.5 లక్షల వరకు వార్షిక ప్యాకేజీని కంపెనీ ఆఫర్ చేస్తున్నట్లు ఉద్యోగ ప్రకటనలో పేర్కొంది.

అలాగే ఉద్యోగులకు వర్క్ లొకేషన్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, కలకత్తాగా కంపెనీ ఇందులో వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఉన్న తెలుగు నిపుణులు కూడా ప్రస్తుతం ఈ జాబ్ రోల్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ఉద్యోగాన్ని పర్మనెంట్ రోల్ కింద తీసుకుంటున్నట్లు తెలిపింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ రోల్ కింద ఉన్న ఈ ఉద్యోగానికి ఏదైనా గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో పాటు పైన పేర్కొన్న శాప్ స్కిల్స్ తప్పనిసరిగా కంపెనీ వెల్లడించింది. దీనికోసం టెక్కీలు ఫుల్ స్టాక్ పై గట్టి పట్టుకలిగి ఉండాలని తెలుస్తోంది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులు తమ వివరాలను [email protected] మెయిల్ ఐడీకి పంపించవచ్చని జాబ్ పోస్టింగ్ లో కంపెనీ వెల్లడించింది.
కంపెనీ వివరాల గురించి తెలుసుకుందే ప్రస్తుతం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ దేశంలో భారీగా ఉద్యోగులను కలిగి ఉంది. ఇటీవల కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ ఆదాయాలు నిపుణుల అంచనాలకు మించి ఉండటంతో ఐటీ పరిశ్రమ సంతోషంలో ఉంది. అలాగే కంపెనీ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేస్తూ మంచి రోజులు తిరిగి ప్రారంభమయ్యాయని ఐటీ కంపెనీల వ్యాపారం మెరుగుపడుతుందనే సంకేతాలను ఇచ్చింది. దీంతో భారతదేశంలోని టాప్ ఐటీ కంపెనీల షేర్లు సైతం సానుకూలంగా స్పందించాయి. చాలా కాలంగా ఐటీ పరిశ్రమ మందగించిన కొత్త ఆర్డర్లతో సతమతమౌతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్లు ప్రారంభం కావటం టెక్కీల్లో కూడా మంచి రోజులు వచ్చాయనే నమ్మకాన్ని నింపుతున్నాయి.
ఈ జాబ్ ఓపెనింగ్ కి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications