Infosys కంపెనీలో 1000 ఓపెనింగ్స్.. హైదరాబాదులో జాబ్, కావాల్సిన స్కిల్స్ ఇవే..!
IT News: ప్రపంచ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న వేళ భారతీయ ఐటీ పరిశ్రమకు తిరిగి పూర్వ వైభవం తిరిగి వస్తోందని తెలుస్తోంది. ప్రధానంగా టెక్ కంపెనీలకు కొత్త ప్రాజెక్టుల లభ్యత పెరుగుతున్న వేళ దానికి తగినట్లుగా ఉద్యోగుల సంఖ్యను సదరు సంస్థలు పెంచుకుంటున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాల కోసం వేటాడుతున్న యువతకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ జాబ్ ఓపెనింగ్స్ గురించే. తాజాగా కంపెనీ ఆటోమేషన్ టెస్టింగ్ పోస్టులకు ఐటీ నిపుణులను నియమించుకుంటున్నట్లు పేర్కొంది. నౌకరీలో అందించిన వివరాల ప్రకారం కంపెనీలో ఈ పొజిషన్ కోసం దాదాపు 1000 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం కంపెనీ 5-10 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలని పేర్కొంది. అలాగే జాబ్ లొకేషన్ హైదరాబాద్, పూణే, బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్ కోసం కనీసం 2 ఏళ్లు కనీసం అనుభవం కలిగి ఉండాలని పేర్కొంది. ఈ క్రమంలో జాబ్ కోసం అప్లై చేసుకునే వ్యక్తులు ఆటోమేషన్ టెస్టింగ్, సెలీనియమ్, జావా స్కిల్స్ తప్పనిసరిగా పేర్కొంది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్, ఎమ్ఎస్సీ గా పేర్కొంది. ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ బృందంలో భాగంగా ప్రాథమిక పాత్ర ప్రాజెక్ట్ వివిధ దశల్లో కన్సల్టింగ్ బృందానికి సహాయం చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటివి ఉంటాయి.
వ్యాపార అవసరాలకు అనుగుణంగా టైలర్ మేడ్ పరిష్కారాలను సిద్ధం చేయాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే రాబోయే ప్రక్రియలను నిర్వచిస్తారు. అవసరాల ఆధారంగా వివరణాత్మక క్రియాత్మక డిజైన్లను రూపొందిస్తారు. ఉత్పత్తులపై పరిష్కార అవసరాలను కాన్ఫిగర్ చేయడానికి మీరు మద్దతు ఇవ్వటంతో పాటు.. ఏవైనా సమస్యలు ఉంటే అర్థం చేసుకుని వాటి మూల కారణాన్ని కనుక్కోవటం వంటి టెక్నకల్స్ నిర్థారించాల్సి ఉంటుంది.
ప్రస్తుకం కంపెనీ తన రిక్రూట్మెంట్ చేసుకుంటున్న జాబ్ కోసం ఎంత వేతనాన్ని ఆఫర్ చేస్తుందనే విషయాలను బయటపెట్టలేదు. అయితే జాబ్ కోసం అప్లై చేసిన వ్యక్తుల అనుభవం, వారి పనితీరు, గత కంపెనీలోని వేతనం వంటి అనేక కారణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ సమయంలో వార్షిక ప్యాకేజీ వివరాలను బయట పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది పూర్తిగా హెచ్ ఆర్ రౌండ్ సమయంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఉద్యోగ ఆఫర్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.naukri.com/job-listings-automation-tester-bangalore-infosys-hyderabad-pune-bengaluru-5-to-10-years-100125019721?src=seo_srp&sid=17365921102252515&xp=7&px=1


Click it and Unblock the Notifications