HCLTech హైదరాబాదులో జాబ్.. రూ.16 లక్షల వార్షిక వేతనం, హైబ్రిడ్ వర్క్ కూడా..!
IT News: రెండు తెలుగు రాష్ట్రాల్లో టెక్కీలకు మంచి కాలం మెుదలైంది. ఇటీవలి కాలంలో హై పెయిడ్ ఉద్యోగాలు ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగా రిక్రూటింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరు తర్వాత టెక్ కంపెనీలు హైదరాబాదును తమ వ్యాపారాలకు అనుకూలంగా భావించటమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ హై పెయిడ్ ఉద్యోగుల కోసం రిక్రూట్ చేసుకుంటోంది. కంపెనీ 6-9 ఏళ్లు అనుభవం కలిగిన టెక్కీలను శాప్ ఈడబ్ల్యూఎమ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగానికి రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి కంపెనీ హైదరాబాద్, పూణే, బెంగళూరు లొకేషన్లలో ఉద్యోగం చేసేందుకు అనుకూలంగా ఉండాలని సూచించింది. ఈ పొజిషన్ కోసం కేవలం ఇద్దరు టెక్కీలను మాత్రమే నియమించుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. పైగా ఈ ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కూడా ఆఫర్ చేస్తోంది.

అన్ని RICEF ఆబ్జెక్టుల్లో SAP ABAP నాల్డెడ్జ్ తప్పనిసరిగా అవసరమని కంపెనీ వెల్లడించింది. పైగా ఈ ఉద్యోగం కోసం రూ.11 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు వార్షిక వేతనాన్ని కంపెనీ అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే శాప్ ఈడబ్ల్యూఎంపై బేసిక్ పరిజ్ఞానం తప్పనిసరిగా కంపెనీ వెల్లడించింది. అబాప్ క్లీన్ కోడ్ల గురించి అవగాహన తప్పనిసరిగా కంపెనీ వెల్లడించింది. అయితే ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటున్న వ్యక్తులు కనీసం 0-30 రోజుల లోపు నోటీస్ పరియడ్ కలిగి ఉండాలని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఉద్యోగం ఈరోజు నుంచి రిక్రూట్మెంట్ కోసం తెరవబడింది.
కంపెనీ ఈ ఉద్యోగం పూర్తి స్థాయి కేటగిరీ కిందకు వస్తుందని వెల్లడించింది. అలాగే ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హత కలిగిన వ్యక్తులు ఉద్యోగం కోసం అప్లై చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఉద్యోగం సాఫ్ట్‌వేర్ డెవలపర్ కేటగిరీ కిందకు వస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2.22 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. దాదాపు 60 దేశాల్లో కంపెనీ వ్యాపారాలను కలిగి ఉంది.
కంపెనీ డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్, ఏఐ సేవలను ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలకు అందిస్తూ వస్తోంది. మేము అన్ని ప్రధాన విభాగాల్లోని క్లయింట్‌లతో కలిసి పని చేస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, తయారీ, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, టెక్నాలజీ అండ్ సర్వీసెస్, టెలికాం అండ్ మీడియా, రిటైల్ సహా అనేక రంగాలకు తన సేవలను అందిస్తోంది.
ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications