Canva Lay Off's: ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. కాన్వాలో 1300 మంది ఔట్..!
మళ్లీ ఉద్యోగాల తొలగింపు మొదలైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతతో పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. పైగా ఏఐ ముప్పు కూడా పొంచి ఉంది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపును చేపట్టాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ, తన కంపెనీలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీ ఖర్చులను తగ్గిచేందుకు సుమారుగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది ఉద్యోగాలు రాత్రికి రాత్రే పోతున్నాయి. ఇన్నోడాటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాత్రికి రాత్రే 550 మంది ఉద్యోగులను తీసేసింది.
తాజాగా ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన కాన్వా ఇంక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా తన సంస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.
ఇందులో తన ఉద్యోగులలో ఐదవ వంతు కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేసేలా ఉద్యోగుల తొలగింపు, సమగ్ర పునర్వ్యవస్థీకరణను ప్రకటించింది. కాన్వా సిబ్బందిలో కనీసం 1,271 మంది అంటే 22 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోతారని తెలుస్తోంది. ఆన్లైన్ డిజైన్, పబ్లిషింగ్ ప్లాట్‌ఫామ్ అయిన కాన్వాలో జరుగుతున్న ఈ సమగ్ర మార్పులు, సాఫ్ట్వేర్ పరిశ్రమ అంతటా నెలకొన్న విస్తృత సంక్షోభానికి నిదర్శంగా మారాయి.

ఆంత్రోపిక్ పీబీసీ వారి క్లాడ్ వంటి కొత్త టెక్నాలజీ ఈ సంస్థల వ్యాపారాలను దెబ్బతీస్తుందనే ఆందోళనల మధ్య పెట్టుబడిదారులు కంపెనీల నుంచి బిలియన్ల డాలర్లను ఉపసంహరించుకున్నారు.
ప్రత్యేక ప్రోగ్రామ్‌లు లేకుండానే ప్రజలు సొంతంగా ఎక్కువ పనులు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీలు కల్పిస్తుండగా, కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో పనిచేయడానికి ఏఐ ఉపయోగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాన్వా ఉద్యోగులకు ఓ నోటు పంపింది. ఎంత మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారో స్పష్టంగా చెప్పలేదు. కాగా కాన్వాను క్లిఫ్ ఓబ్రెచ్ట్, కామెరాన్ ఆడమ్స్‌తో కలిసి స్థాపించారు. ఈ పునర్వ్యవస్థీకరణను తమ 13 ఏళ్ల చరిత్రలో అత్యంత కష్టమైన క్షణంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెలానీ పెర్కిన్స్ అభివర్ణించారు.
19 ఏళ్ల వయసులో, పెర్కిన్స్ క్లిఫ్ ఓబ్రెచ్ట్తో వ్యాపార భాగస్వామి అయ్యారు. ఈ ఇద్దరూ కలిసి వారి మొదటి డిజైన్ ప్లాట్‌ఫామ్ అయిన ఫ్యూజన్ బుక్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత, 2013లో కామెరాన్ ఆడమ్స్ ఈ బృందంలో చేరారు. ప్రజలు లోగోలు, పోస్టర్లు లేదా బిజినెస్ కార్డ్‌లను సులభంగా డిజైన్ చేయడానికి వీలుగా ఈ ముగ్గురూ కలిసి కాన్వాను ప్రారంభించారు. వినియోగదారులు ఫోటోలను అప్లోడ్ చేయవచ్చు లేదా స్టాక్ చిత్రాలను ఎంచుకోవచ్చు, ఆపై డిజైన్లను అనుకూలీకరించడానికి ముందుగా సెట్ చేసిన ఫిల్టర్లు, ఫాంట్లను ఉపయోగించవచ్చు. ఇండియాలో కూడా కాన్వాను విరిగా వాడతారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications