ఇంజినీరింగ్ చేసిన వారికీ మంచి ఛాన్స్.. BHELలో భారీగా ఉద్యోగాలు.. మిస్ చేసుకోకండి..
ఇంజినీరింగ్ రంగంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థుల కోసం మంచి అవకాశం. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇంజనీర్ అండ్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.bhel.com/recruitmentని వెళ్లడం ద్వారా దరఖాస్తు చేసుకోగవచ్చు.
BHEL మొత్తంగా 400 ట్రైనీ అండ్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఇంజనీర్ పోస్టులు 150, సూపర్ వైజర్ 250 పోస్టులు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ వంటి వివిధ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 ఫిబ్రవరి 2025. చివరి తేదీ దాటిన తర్వాత దరఖాస్తు ఫామ్ ఆమోదించబడదు. కాబట్టి, అభ్యర్థులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలని కోరింది. అయితే, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌ను వెళ్లడం ద్వారా అభ్యర్థులు వయోపరిమితి సడలింపు గురించి సమాచారాన్ని పొందవచ్చు.

ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ పొంది ఉండాలి. అయితే సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల కోసం అభ్యర్థులు ఫుల్ టైం డిప్లొమా డిగ్రీ చేసి ఉండాలి.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి పరీక్ష CBT విధానంలో నిర్వహిస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సెలెక్షన్ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ చూడాల్సి ఉంటుంది.
ఈ ఖాళీ పోస్టులకి దరఖాస్తు చేసుకునే జనరల్ (UR), OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 795 ఫీజు చెల్లించాలి. కాగా పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అండ్ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.295 చెల్లించాల్సి ఉంటుంది. ఇంజనీర్ అండ్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత, పోస్టుకు సంబంధించిన వయోపరిమితితో సహా ఖాళీలకి సంబంధించిన అన్ని షరతులు ఇంకా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి. అలా చేయని అభ్యర్థుల దరఖాస్తు ఫామ్‌లను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంగీకరించదు.


Click it and Unblock the Notifications