Income Tax: ఇన్కమ్ టాక్స్ లెక్కింపు, చెల్లింపు విధానంలో భారత ప్రభుత్వం రెండు విధానాలను అమలులోకి ఉంచింది. ఇందులో ఒకటి ఎప్పటి నుంచో ఉన్న పాత టాక్స్ రీజిమ్ కాగా.. రెండోది కొత్త టాక్స్ రీజిమ్. అయితే ఇప్పుడు చాలా మందిలో ఉన్న గందరగోళం ఏమిటంటే తమ ఆదాయానికి ఏది ఎంచుకోవటం ఉత్తమం. ఎక్కడ తక్కువ టాక్స్ ఉంటుంది అన్నదే.
2023-24 వార్షిక యూనియన్ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద శ్లాబ్ రేట్లను మార్చటంతో పాటు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ క్రమంలో ఏడాదికి రూ.10 లక్షలు ఆదాయం కలిగిన సీనియర్ సిటిజన్లకు పన్ను ఆదా చేసుకునేందుకు ఏ టాక్స్ విధానం ఉపకరిస్తుందో నిపుణులను అడిది తెలుసుకుందాం.

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన టాక్స్ విధానం కింద పన్ను లెక్కిస్తే రూ.10 లక్షల ఆదాయంపై ఒక సీనియర్ సిటిజన్ రూ.62,400 పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అదే పాత పన్ను విధానంలో లెక్కించినట్లయితే ఎలాంటి పన్ను మినహాయింపులను పరిగణలోకి తీసుకోకుండా అయితే రూ.1,14,400గా వచ్చింది.పెట్టుబడుల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్లాలనుకునే వారికి కొత్త టాక్స్ విధానం చాలా సులభమైనది, సరళమైనదని తెలుస్తోంది.
వ్యాపారులు కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకున్న తర్వాత పాత విధానానికి మారటానికి ఆదాయపుపన్ను చట్టం అనుమతించటం లేదు. అందువల్ల కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులను సరిపోతుందని వారు చెబుతున్నారు.

ఇన్సూరెన్స్ ప్లాన్స్, హౌస్ లోన్ వంటి టాక్స్ తగ్గింపులు లేనట్లయితే అలాంటి వ్యక్తులు కొత్త టాక్స్ విధానం కింద ఐటీఆర్ ఫైల్ చేయటం ఉత్తమమని క్యూబ్ వెల్త్ సీఈవో సత్యన్ కొఠారి అభిప్రాయపడ్డారు. ఒకవేళ టాక్స్ సేవింగ్స్ ఎక్కువగా చేస్తున్నట్లయితే వారికి పాత పన్ను విధానమే సరైనదిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications