ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నుండి ఎస్సెమ్మెస్‌లు పంపించడం, అందుకోవడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను తొలుత ఆండ్రాయిడ్ సెంట్రల్ గుర్తించింది. గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో అప్ డేట్ చేసినప్పుడు సమస్య వస్తోందని, ఎస్సెమ్మెస్ పంపించే సమయంలో దాదాపు అరగంట వరకు లాగ్స్ ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అయితే ఈ సమస్య పరిష్కారం కావడానికి ఓ పరిష్కారం ఉంది.

ఈ ఫోన్లలో సమస్య
వాట్సాప్ వంటివి వచ్చాక మెసేజ్‌లు చేయడం చాలా వరకు తగ్గిపోయింది. అయితే మెసేజ్‌లు రావడం, పోవడం ఇప్పటికీ జరుగుతుంటాయి. మనం ఏటీఎంలో చేసే ట్రాన్సాక్షన్ నుండి ప్రతిది మెసేజ్ రూపంలో వస్తుంది. ఇక, వాట్సాప్ ఆప్షన్ లేకుంటే మెసేజ్ పంపించడమే పరిష్కారం. అయితే కొన్ని మొబైల్ కంపెనీల స్మార్ట్ ఫోన్ల నుండి కొద్దిరోజులుగా మెసేజ్‌లు వెళ్లడం లేదు. ఈ ఇబ్బందులు LG, వన్ ప్లస్, శాంసంగ్ వంటి ఫోన్లలో ఉన్నాయి.

అన్-ఇన్‌స్టాల్ చేయాలి
మీరు కనుకు ఈ మొబైల్స్ వాడుతూ, మెసేజ్‌లు పంపించలేకపోవడం లేదా రిసీవ్ చేసుకోలేకపోవడం వంటి సమస్యను ఎదుర్కొంటే పరిష్కారం ఉంది. అయితే ఆండ్రాయిడ్ ఉపయోగిస్తున్న వారికే ఈ సమస్య వస్తోంది. గూగుల్ క్యారియల్ సర్వీసెస్ యాప్ వల్ల ఈ సమస్య వస్తున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ యాప్‌ను అన్-ఇన్‌స్టాల్ చేయడం ద్వారా తాత్కాలికంగా పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు.

ఇలా చేయండి
ఇటీవల గూగుల్ క్యారియల్ సర్వీసెస్ యాప్‌కు ప్లే స్టోర్ గూగుల్ కొత్త వర్షన్‌ను తీసుకు వచ్చింది. దీనిని అన్-ఇన్‌స్టాల్ చేసుకుంటే సందేశాల సమస్య తీరిపోతుందని చెబుతున్నారు. ప్లేస్టోర్‌లోని లెఫ్ట్ మెనూలో ఉన్న మై యాప్స్‌లోకి వెళ్లి, అందులో క్యారియల్ సర్వీసెస్ యాప్‌ను గుర్తించి తొలగించాలి. ఆ తర్వాత మొబైల్‌ను రీస్టార్ట్ చేయాలి. గూగుల్ క్యారియర్ సర్వీస్ కూడా కొత్త అప్ డేట్ రిలీజ్ చేస్తుంది. దానిని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications