రైలు ప్రయాణం మిస్ అయిందని బాధపడకండి..మీ డబ్బులు రీఫండ్ కోసం ఇలా చేయండి..సింపుల్ స్టెప్స్ ఇవే..
మనం ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసినా, ఎదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇది మనకే కాదు - చాలామందికి జరిగే అనుభవమే. నిజానికి, రైలు ప్రయాణంలో ఒక్క సమస్య కూడా రాకుండా ఉంటే అదొక అరుదైన విషయం! సీటు లేకపోవడం, AC లేదా లైట్ పని చేయకపోవడం, రైలు గంటల కొద్దీ ఆలస్యంగా రావడం ఇవన్నీ మనం ఎన్నోసార్లు ఎదుర్కొన్నాము. అప్పుడు మనకు వచ్చే ఆలోచనలే "ఇది ఎవరికి చెప్పాలి?", " టికెట్ డబ్బులు తిరిగి వస్తాయా?" ఇలా అనుకుంటూ చివరికి ఊరుకునేదే!

కానీ ఇప్పుడు ఇక అలా చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ రైల్వే "TDR" (Ticket Deposit Receipt) అనే ఒక సులభమైన మార్గాన్ని అందిస్తోంది. మీరు ప్రయాణంలో అసౌకర్యాన్ని ఎదుర్కొంటే, వెంటనే TDR ఫైల్ చేసి డబ్బును రీఫండ్‌గా పొందవచ్చు.
అంతే కాదు - ఎలా ఫైల్ చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏ పరిస్థితుల్లో చేస్తే డబ్బు వస్తుంది? ఇలా అన్ని వివరాలు తెలుసుకుందాం.
TDR అంటే ఏమిటి?
TDR అనేది ఒక టికెట్ డిపాజిట్ రిసీట్. ఇది ఇండియన్ రైల్వే అందించే ఒక విధమైన ఫార్మల్ కంప్లైంట్/రిఫండ్ విధానం. మీరు రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకుని ఉండి, ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల ప్రయాణించలేకపోతే లేదా రైల్వే కారణంగా అసౌకర్యం కలిగితే, మీరు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా TDR ఫారంని ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు.
ఐఆర్‌సీటీసీలో TDRను ఎలా ఫైల్ చేయాలి?
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (www.irctc.co.in) లేదా యాప్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత My Account → My Transactions → File TDR క్లిక్ చెయ్యాలి. అక్కడ మీ PNR నంబర్ ఎంటర్ చేయాలి. మీ ప్రమాదానికి కారణమైన కారణం ఎంపిక చేయండి (ఉదా: రైలు ఆలస్యం, AC ఫెయిల్యూర్). ఇంకా ప్రభావిత ప్రయాణికులు సెలెక్ట్ చేసి File TDR బటన్ పై క్లిక్ చేసి "Yes" అని సెలెక్ట్ చేయండి. అప్పుడు మీ TDR సబ్మిట్ అయినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఏ సమయంలో మీరు TDR ఫైల్ చేయవచ్చు?
రైలు ఆలస్యం కావడం (అధికంగా - 3 గంటల కంటే ఎక్కువ). మీ రిసర్వేషన్ సీటు మీకు కేటాయించకపోవడం, ట్రైన్ క్యాన్సిలేషన్, AC పని చేయకపోతే గమ్యస్థానానికి చేరిన 20 గంటల లోపుగా, రైలు వేరు మార్గంలో మళ్లించినా, మీ టికెట్ కన్ఫర్మ్ అయినా, ట్రైన్ మిస్ అవడం ఇలాంటి సందర్భాల్లో మీరు TDR ఫైల్ చేయొచ్చు.
తరువాత ఏమవుతుంది?
మీ ఫైల్ చేసిన TDRను రైల్వే జోనల్ రీఫండ్ ఆఫీస్ పరిశీలిస్తుంది. సాధారణంగా 60 రోజుల్లోపు రీఫండ్ డబ్బులు మీ అకౌంట్లోకి చేరుకుంటాయి. సమయానికి ఫైల్ చేయకపోతే రీఫండ్ నిలిపివేయబడుతుంది. రైల్లో TTE సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల అదే మీకు ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది.
మీకు సమస్య తలెత్తిన వెంటనే TDR ఫైల్ చేయండి. ఒకవేళ లేట్ అయితే రీఫండ్ రాదు. AC ఫెయిల్యూర్, కోచ్ మిస్సింగ్ వంటి వాటికి సాక్ష్యాలు ఉండటం మంచిది. రీఫండ్ పూర్తి అయ్యే వరకు PNR, SMSలు, సర్టిఫికెట్లు భద్రంగా ఉంచండి.


Click it and Unblock the Notifications