Income Tax: యూపీఐ ద్వారా డబ్బులు పంపుతున్నారా.. ఐటీ నోటీసులు రావొచ్చు..!
చాలా మంది ఆన్ లైన్ లావాదేవీలు చేస్తుంటారు. అలాగే బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేస్తుంటారు. అయితే మనం చేసే ప్రతి లావాదేవీపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద మొత్తాల లావాదేవీలపై నిఘా తప్పకుండా ఉంటుంది. అయితే భారీగా ఆన్ లైన్ లావాదేవీలు చేస్తుంటారు. అయితే వారికి ఐటీ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు యూపీఐ ట్రాన్సిక్షన్ చేసినా, నెఫ్ట్ చేసినా ఏదైనా మీ పాన్ నంబర్ పై రికార్డ్ అవుతూ ఉంటుంది. అయితే ఎంత మొత్తం డబ్బుల లావాదేవీలు జరిపితే ఐటీ నోటీసులు వస్తాయో చూద్దాం.
మీరు ఒకే ఆర్థిక సంవత్సరంలో సేవింగ్ ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే బ్యాంకు దానిని తప్పనిసరిగా నివేదించాలి. లేకుంటే ఇన్కామ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు ఒక ఇళ్లు అమ్మారు అనుకుంటే.. దానికి రూ.50 లక్షలు వస్తే.. ఆ మొత్తం బ్యాంకులో వేస్తే దానికి ప్రూఫ్ గా మీరు ఇళ్లు అమ్మిన పత్రాలు చూపించాలి. ఒకవేళ మీకు ఐటీ నోటీసులు వస్తే అమ్మకం దస్తావేజు, రుణ చెల్లింపు రసీదు, బహుమతి దస్తావేజు చూపించాల్సి ఉంటుంది.

మీరు కరెంట్ ఖాతా వాడితే ఒక సంవత్సరంలో రూ.50 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే కూడా ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు రూ.10 లక్షలు దాటినా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీకు ఆ డబ్బు ఎలా వచ్చిందో పత్రాలు చూపిస్తే సరిపోతుంది. మీరు ప్రతి నెలా రూ.2-3 లక్షల నగదు లావాదేవీలు చేస్తే ఐటీ నుంచి నోటీసులు రావచ్చు. అలాగే స్టాంప్ డ్యూటీ విలువ లేదా లావాదేవీ విలువ రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఏదైనా ఆస్తి ఒప్పందాన్ని (అమ్మకం లేదా కొనుగోలు) తప్పనిసరిగా SFT కింద నివేదించాలి.
ఐటీ శాఖ ఆన్ లైన్ల ట్రాన్సిక్షన్ల కంటే.. క్యాష్ డిపాజిట్ పై ఎక్కువ నిఘా ఉంచుతుంది. క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఐటీ శాఖకు వివరించాలి. బ్యాంక్ డ్రాఫ్ట్స్, బ్యాంకర్స్ చెక్కులు మొత్తం ఒక ఏడాదిలో రూ.10 లక్షలు దాటినా ఐటీ శాఖ స్పందించే అవకాశం ఉంటుంది. ఒకటి లేదా ఎక్కువ క్రెడిట్ కార్డుల బిల్లులు రూ.1 లక్ష ఆపైన నగదు రూపంలో చెల్లించినా ఐటీ నోటీసు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విదేశీ కరెన్సీ విక్రయించినప్పుడు రూ.10 లక్షలు దాటినా నోటీసులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications