IT Exemptions: ఈ 10 రకాల పన్ను మినహాయింపులు తెలుసా..? ITR ఫైలింగ్‌కి ముందే తెలుసుకోండి..
Income Tax News: దేశ వ్యాప్తంగా పలువురు ఇప్పటికే ఆదాయపు పన్ను ఫైలింగ్ ఇప్పటికే పూర్తి చేశారు. మరికొందరు ఇంకా చేయాల్సి ఉంది. ఈ నెలాఖరు పైన్ లేకుండా రిటర్నులు సమర్పించేందుకు తుది గడువు కావడంతో త్వరపడుతున్నారు. అయితే దానికి ముందు పన్ను వర్తించని ఆదాయాల గురించి తెలుసుకోవడం ద్వారా చాలా వరకు ట్యాక్స్ తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
దాదాపు 10 రకాల ఆదాయాలు పన్ను పరిధిలోకి రాకుండా ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చింది. కేవలం పంటలపై మాత్రమే కాకుండా వ్యవసాయ భూమి లేదా అందులోని భవనాల నుంచి పొంది అద్దె కూడా దీని కిందకే వస్తుంది.వ్యవసాయ భూమి కొనుగోలు మరియు అమ్మకాలపై లాభం కూడా పన్ను రహితమే.

NRE ఖాతాలు, వాటి డిపాజిట్లపై వచ్చే వడ్డీ పన్ను రహిత ప్రయోజనాలను అందిస్తుంది. NRIలు ఈ ఖాతాల ద్వారా తమ స్వస్థలానికి నిధులను తేలికగా బదిలీ చేయవచ్చు. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో పొందుతున్న 20 లక్షల మేర గ్రాట్యుటీపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూమికి బదులు పరిహారం పొందుతున్న వారికి కూడా మినహాయింపు లభిస్తుంది.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పార్టనర్‌షిప్ సంస్థ ఆదాయంపై ఎంటిటీ స్థాయిలో పన్ను విధించబడుతుంది. కాబట్టి భాగస్వాములు పన్నులు చెల్లించిన తర్వాత లాభంలో వారు వాటా పొందుతారు. దీనిపై తిరిగి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల నుంచి స్కాలర్‌షిప్‌లు పొందుతున్న విద్యార్థులు కూడా ఆదాయపు పన్ను నుండి మినహాయించబడ్డారు.
ఉద్యోగులు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చురుకుగా చందా చెల్లించినట్లయితే వారు కంపెనీలు మారినప్పటికీ ప్రావిడెంట్ ఫండ్‌పై ట్యాక్స్ ఉండదు. పదవీ విరమణ తర్వాత తీసుకునే PFపై కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. కొన్ని సంస్థల నుంచి ఆయా వ్యక్తులకు వచ్చే పెన్షన్లు, ఉద్యోగులపై ఆధారపడిన వారు పొందే కుటుంబ పింఛన్లు కూడా పన్ను రహితమని గమనించాలి.
స్వచ్ఛంద పదవీ విరమణ వేళ స్వీకరించిన మొత్తానికి 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. బంధువుల నుంచి లేదా వివాహం సందర్భంగా స్వీకరించే బహుమతులపై కూడా పన్ను పరిధి నుంచి తొలగించబడ్డాయి. వీటితో పాటు ప్రభుత్వం అందించే పలు అలవెన్సులు కూడా ట్యాక్స్ కిందకు రావు. పదవీ విరమణ అనంతరం PSUల ఉద్యోగులు పొందే పరిహారం సైతం పన్ను నుంచి మినహాయింపబడింది.


Click it and Unblock the Notifications