అనవసరంగా ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంచుకోవడం సరికాదు. అవసరం మేరకు, పరిమతి సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు నిర్వహించుకోవాలి. అనవసరంగా, ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే కూడా ఇబ్బందికరమే! ఎందుకంటే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వాటిని నిర్వహించేందుకు ప్రధానంగా మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి. ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే క్లోజ్ చేయడం ఉత్తమం. ఈ నేపథ్యంలో బ్యాంకు అకౌంట్ క్లోజింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి.

ఇది మరిచిపోవద్దు
బ్యాంకు అకౌంట్ మూసివేయడానికి కొన్ని దశలు ఉంటాయి. మీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయడానికి ముందు పేటీఎం, ఉబెర్, స్విగ్గీ వంటి పేమెంట్ యాప్స్‌ను డీ-లింక్ చేయడం మరిచిపోవద్దు. ఒకటి కంటే ఎక్కువ లేదా అవసరమైన వాటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండి, అవి ఉపయోగపడకుంటే క్లోజ్ చేయడం ఉత్తమం. మినిమం బ్యాలెన్స్‌తో పాటు పాస్ వర్డ్స్ వంటి వివిధ కారణాలు తలనొప్పి కలిగించేవే.

ఇవి గుర్తుంచుకోండి
- మీరు బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత దీనిని రీ-ఓపెన్ చేయలేరు.
- అకౌంట్ క్లోజ్ చేయడానికి ముందు మీ బ్యాలెన్స్ జీరోగా ఉండేలా చూసుకోవాలి.
- క్లోజ్ చేయడానికి ముందు ఏవైనా పెండింగ్ డ్యూస్ ఉంటే వాటిని చెల్లించాలి.
- మీరు పూర్తి బ్యాంకు స్టేట్‌మెంట్ తీసుకొని ఉంచుకోవడం మంచిది. భవిష్యత్తులో ఎందుకైనా అవసరం ఏర్పడవచ్చు.

అందరూ సంతకం చేయాలి
- బ్యాంకు అకౌంట్ క్లోజింగ్‌కు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- మీరు బ్యాంకు అకౌంట్‌ను ఆన్‌లైన్ ద్వారా క్లోజ్ చేయలేరు. కచ్చితంగా హోం బ్రాంచీని సంప్రదించాలి. హోం బ్రాంచీకి వెళ్లి క్లోజింగ్ కోసం విజ్ఞప్తి చేయాలి.
- అన్ని బ్యాంకులు కూడా క్లోజర్ ఫామ్ కలిగి ఉంటాయి. మీరు వీటిని బ్యాంకు బ్రాంచీ లేదా వెబ్ సైట్ నుండి పొందవచ్చు.
- ఉమ్మడి ఖాతా అయితే ఖాతాదారులు అందరూ క్లోజింగ్ ఫాంలో సంతకాలు చేయాలి.

అకౌంట్ క్లోజింగ్ ఛార్జీలు
- అకౌంట్ క్లోజింగ్ ఫాంను తీసుకొని, అందులో పూర్తి వివరాలు సమర్పించాలి. ఖాతాదారుడి పేరు, ఖాతా సంఖ్య, కాంటాక్ట్ నెంబర్, ఖాతాదారు సంతకం, ఖాతా మూసివేయడానికి గల కారణాలు వంటి వివరాలు సమర్పించాలి.
- ఫాం పూర్తి చేసిన తర్వాత దానిని బ్యాంకులో సమర్పించాలి.
- మీరు మీ చెక్కు బుక్, పాస్ బుక్కు, డెబిట్ కార్డులను బ్యాంకుకు సమర్పించాలి. కొన్ని బ్యాంకులు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అడుగుతాయి.
- కొన్ని బ్యాంకులు అకౌంట్ క్లోజింగ్ ఛార్జీలు వసూలు చేస్తాయి.


Click it and Unblock the Notifications