నేటి కాలంలో ఆర్థిక క్రమశిక్షణ అనగానే అందరికీ గుర్తొచ్చేది సిప్ ఇన్వెస్ట్ మెంట్ (SIP Investment). ప్రతినెలా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ కోటీశ్వరులు కావాలని చాలామంది కలలు కంటారు. "నేను ఐదేళ్లుగా SIP చేస్తున్నాను" అని గర్వంగా చెప్పుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే కేవలం పెట్టుబడులు పెడితేనే మీ ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉంటుందా? అంటే కాదనే అంటున్నారు ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాజీవ్ బన్సల్.

పునాది లేని చోట.. రక్షణ ఉండదు!
చాలా మంది ఇన్వెస్టర్లు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే.. ప్రాథమిక రక్షణ లేకుండా నేరుగా సంపద సృష్టి (Wealth Creation) వైపు పరుగెత్తడం. రాజీవ్ బన్సల్ అభిప్రాయం ప్రకారం.. జీవితంలో అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలు పేక మేడల్లా కూలిపోతాయి. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, ఉద్యోగం పోయినా మనం చేసే మొదటి పని.. దాచుకున్న సేవింగ్స్ ను లేదా మ్యూచువల్ ఫండ్స్ ను విత్ డ్రా చేయడం. ఇదేమీ ఆర్థిక పతనానికి ఆరంభం!
HIP, TIP అంటే ఏమిటి? ఎందుకు ముఖ్యం?
రాజీవ్ బన్సల్ ఒక అద్భుతమైన ఫార్ములాను ప్రతిపాదించారు. అదే "HIP + TIP = Safe SIP".
- HIP (Health Insurance Plan): ఇది మీ ఆరోగ్యాన్ని అలాగే మీ పొదుపును కాపాడుతుంది. ఆసుపత్రి ఖర్చులు మీ ఇన్వెస్ట్‌మెంట్ ను కరిగించకుండా అడ్డుకుంటుంది.
- TIP (Term Insurance Plan): ఇది మీ ఆదాయానికి అలాగే మీ కుటుంబానికి రక్షణ. సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే, కుటుంబం రోడ్డున పడకుండా ఈ ఇన్సూరెన్స్ కాపాడుతుంది.
"SIP సంపదను పెంచుతుంది.. కానీ HIP & TIP ఆ సంపదను కాపాడతాయి" అని ఆయన పేర్కొన్నారు. ఈ రక్షణ కవచాలు లేకపోతే మీరు చేసే SIP ఇన్వెస్ట్ మెంట్ ఎప్పుడైనా ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఆర్థిక ప్రణాళికలో సరైన వరుస క్రమం ఇదే!
చాలామంది ముందుగా ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత మిగిలితే ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తారు. కానీ, నిపుణుల ప్రకారం అది తప్పు. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ క్రమంలో ఉండాలంటే.. ముందుగా HIP చేయాలి. అంటే ఆరోగ్యం కోసం ప్లానింగ్.. ఆ తర్వాత TIP.. అంటే ఆదాయం, కుటుంబ భద్రత కోసం ప్లానింగ్.. ఆ పైనే SIP ప్లానింగ్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క హాస్పిటల్ బిల్లు మీ ఏళ్ల నాటి సేవింగ్స్ ను తుడిచిపెట్టేస్తుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే కుటుంబ సభ్యుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారుతుంది.
ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం
పెట్టుబడులు పెట్టవద్దని నిపుణులు చెప్పడం లేదు. కానీ, సరైన పద్ధతిలో చేయాలని సూచిస్తున్నారు. కష్టకాలంలో కూడా మీ దీర్ఘకాలిక లక్ష్యాలు దెబ్బతినకూడదంటే, రక్షణ కవచం (Protection) అనేది తప్పనిసరి. "ముందు రక్షణ.. తర్వాతే వృద్ధి.. అప్పుడే శాశ్వత సంపద" అని రాజీవ్ బన్సల్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కాబట్టి, వీలైనంత త్వరగా మీ పోర్ట్‌ఫోలియోను సరిచూసుకోండి. మీరు కేవలం ఇన్వెస్ట్ చేస్తున్నారా లేక మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కాపాడుకునే ఏర్పాటు కూడా చేసుకున్నారా?
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications