For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రేడర్స్‌కు ఆర్బీఐ భారీ రిలీఫ్, కార్పోరేట్ రుణపరిమితి పెంపు

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం (మే 22) రెపోరేటును 40బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉదయం వెల్లడించారు. రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గించారు. ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్ మార్చి 27న, ఏప్రిల్ 17వ తేదీన రెండుసార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. అఫ్పుడు రెపో రేటును 4.4 శాతానికి, రివర్స్ రెపోను 3.75 శాతానికి తగ్గించారు.

మరోవైపు, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో వ్యాపారులు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించారు. దీనిని ఇప్పుడు ఆగస్ట్ 31కి పెంచారు. ఆర్బీఐ తాజా రెపో, రివర్స్ రెపో నిర్ణయం రుణగ్రహీతలు, వ్యాపారులు, డిపాజిటర్లు, సహా సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుందంటే...

2 నెలల్లో మూడోసారి.. రెపోరేటు 40 పాయింట్స్ తగ్గించిన ఆర్బీఐ: EMI తగ్గే అవకాశం2 నెలల్లో మూడోసారి.. రెపోరేటు 40 పాయింట్స్ తగ్గించిన ఆర్బీఐ: EMI తగ్గే అవకాశం

ఎక్స్‌పోర్టర్స్ రుణాలు చెల్లించేందుకు మరింత సమయం

ఎక్స్‌పోర్టర్స్ రుణాలు చెల్లించేందుకు మరింత సమయం

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఎక్స్‌పోర్టర్స్‌కు ఎలా లబ్ధి చేకూరుతుందో ఆర్భీఐ గవర్నర్ తెలిపారు. వారికి వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది, ఎలా ఉపశమనం పొందుతారో తెలిపారు. ఈ నేపథ్యంలో బిజినెస్‌మెన్ కోసం ఏంచేశారో చూద్దాం...

కంపెనీలకు వర్కింగ్ క్యాపిటల్‌పై వడ్డీ చెల్లింపు గడువును పొడిగించారు. చెల్లింపులను ఇప్పుడు మరో మరో మూడు నెలలు పొడిగించారు. వర్కింగ్ క్యాపిటల్ లోన్ అనేది కంపెనీలు రోజువారీ కార్యకలాపాల కోసం తీసుకునే రుణం. లాక్ డౌన్ నేపథ్యంలో ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు మూడునెలలు పొడిగించడం ద్వారా వారికి అదనపు సమయం లభిస్తుంది. అంటే వారి క్రెడిట్ చెల్లింపు కాల వ్యవధి 12 నుండి 15 నెలలకు పెరుగుతుంది. ప్రీ-షిప్‌మెంట్, పోస్ట్ షిప్‌మెంట్ ఎగుమతి రుణ కాల వ్యవధి పదిహేను నెలలకు పొడిగించారు.

ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుకు రూ.15,000 కోట్లు రుణం

ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుకు రూ.15,000 కోట్లు రుణం

ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంకులు (Exim Bank) ట్రేడర్స్‌కు రుణాలు ఇస్తాయి. కరోనా వైరస్ కారణంగా నిధుల సేకరణలో ఈ బ్యాంకు ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిమ్ బ్యాంకుకు 15,000 కోట్ల రుణ చెల్లింపును పొడిగించారు.

కార్పోరేట్ రుణ పరిమితి పెంపు

కార్పోరేట్ రుణ పరిమితి పెంపు

కార్పోరేట్ సంస్థలు వారి నికర వ్యాల్యూ ఆధారంగా బ్యాంకుల నుండి రుణం పొందుతాయి. ఈ పరిమితిని 25 శాతం నుండి 30 శాతానికి పెంచారు. అంటే రుణ పరిమితిని నికర విలువపై 5 శాతం పెంచారు. అయితే ఈ పరిమితి కంపెనీల గ్రూప్‌కు ఉంటుంది.

మరిన్ని...

మరిన్ని...

రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించి సిడ్బీకి (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరో 90 రోజుల గడువు పొడిగింపు.

టర్న్ లోన్ చెల్లింపు గడువు మరో 3 నెలలు పొడిగింపు.

ప్రయివేటు వినియోగం తగ్గడంతో 33 శాతం క్షీణించిన కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి.

English summary

ట్రేడర్స్‌కు ఆర్బీఐ భారీ రిలీఫ్, కార్పోరేట్ రుణపరిమితి పెంపు | RBI Relief: Impact of RBI's announcements on businessmen, Know the relief

How the new steps by RBI impact the common man including borrowers, depositors and businessmen.
Story first published: Friday, May 22, 2020, 18:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X