హైదరాబాద్: మృగాళ్లు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మానవత్వం అనే మాటను మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇందుకు హైదరాబాదులోని ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యనే ఉదాహరణ. ఆమె స్కూటిని నాయకీటంగా పంక్చర్ చేసి, పక్కా ప్లాన్‌తో అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాదు, ఆమెపై కిరోసిన్ పోసి దారుణంగా కాల్చి వేశారు. మనిషిలోని ఇంతటి దారుణమైన ఆలోచనలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె పోలీసులకు సమాచారం అందించి ఉంటే ప్రాణాలు నిలబడేవి. ఆ పరిస్థితుల్లో ఆమెకు ఆ ఆలోచన తట్టకపోయి ఉండవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే వివిధ మార్గాల ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు.

షీ టీమ్ నెంబర్లు సేవ్ చేసుకోవాలి
మీరు ఆపదలో ఉంటే వెంటనే పోలీసులకు చేరవేయండి. ప్రత్యేకంగా వివిధ పనులపై ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు, యువతుల కోసం తెలంగాణ పోలీసులు వివిధ సదుపాయాలు కల్పించారు. ఆ సమయంలో ప్రియాంక రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి ఉంటే బతికి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా ఇదే చెప్పారు. మహిళలు అందరూ కూడా సెల్ ఫోన్‌లో షీ టీమ్ నెంబర్లను సేవ్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో షిటీమ్స్ మెయిల్ అడ్రస్‌లు, వాట్సాప్ నెంబర్లు ఇక్కడచూడండి....

100కు ఫోన్ చేయవచ్చు... 112కు ఫోన్ చేస్తే అన్ని ఎమర్జెన్సీ సేవలు
ఆపదలో డయల్ 100కు ఫోన్ చేస్తే దగ్గరలోని పోలీసులకు సమాచారం వెళ్లే వ్యవస్థ అందుబాటులో ఉంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా 112 ఎమర్జెన్సీ నెంబర్ ఉంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

వెంటనే కాల్ చేయాలి...
తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న టెక్నాలజీతో.. ఫిర్యాదు అందిన వెంటనే నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకునే వ్యవస్థ అందుబాటులో ఉంది. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తోచక ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రియాంక రెడ్డిది అదే పరిస్థితి. ఉన్నత విద్యావంతురాలు, చేతిలో ఆధునాతన మొబైల్ ఫోన్ ఉంది. కానీ ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేయాలనే ఆలోచన రాకపోవడంతో మృగాళ్లు ఆమె ప్రాణాలు హరించారు. కాబట్టి ప్రమాదం ఉంటే ఫోన్ చేయడం మరిచిపోవద్దు.

పోలీసు సేవల్ని ఉపయోగించుకోండి
రాత్రి సమయంలో లేదా ఎవరూ లేని ప్రాంతాల్లో.. ఆపదలో ఉన్న సమయంలో అపరిచితులు సాయంఅందిస్తామంటే నమ్మకపోవడం మంచిది. అందుబాటులో ఉన్న పోలీసు సేవలను ఉపయోగించుకోవాలి.

హాక్ఐ మొబైల్ యాప్
తెలంగాణ పోలీసులు అయిదేళ్ల క్రితం హాక్ఐ అనే మొబైల్ యాప్ రూపొందించారు. ఇందులోని ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్ అనేది ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం ఉద్దేశించింది. మీరు ఎక్కడ ప్రయాణించినా ఫోటో లేదా వీడియో తీసి అందులో అప్ లోడ్ చేస్తే ఆన్ లైన్ ద్వారా పోలీసులకు వెళ్తుంది. మీరు క్యాబ్ లేదా రైలు లేదా బస్సు లేదా ఇతర వాహనాల్లో ప్రయాణిస్తుంటే నెంబర్ నోట్ చేసుకొని పంపించవచ్చు. సమస్య ఉంటే వెంటనే సమాచారం ఇవ్వడం ద్వారా పోలీసుల సహకారం తీసుకోవచ్చు.

హాక్ఐ ద్వారా సమాచారం పంపే సమయం లేకుంటే... SOS
ప్రమాదంలో ఉంటే సమాచారాన్ని పంపించేందుకు సమయం కూడా లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్‌ను ప్రెస్ చేస్తే పోలీసులతో పాటు ముందుగా నమోదు చేసుకున్న కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నెంబర్లకు మీరు ఆపదలో ఉన్నట్లు సమాచారం వెళ్తుంది. ఈ సమాచార ఐదుగురికి వెళ్తుంది. అలాగే మీరు ఉన్న ప్రదేశ్, లొకేషన్ వివరాలు వెళ్తాయి. సమీపంలోని పెట్రోలింగ్‌లో ఉన్న పెట్రో కార్లకు, మెయిన్ కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. మీ మొబైల్లో లొకేషన్ ఆన్‌లో ఉంచితే SOS బటన్ సేవలు మరింత ఈజీ అవుతాయి.

క్యాబ్‌లో వెళ్తుంటే...
ఇటీవలి కాలంలో పోలీసులు క్యాబ్స్ వంటి వాహనాలను పోలీస్ పెట్రో కార్లకు అనుసంధానిస్తూ ఎమర్జెన్సీ సదుపాయం కల్పిస్తున్నారు. క్యాబ్‌లో వెళ్లే వారు అత్యవసర పరిస్థితుల్లో క్యాబ్ బుక్ చేసుకున్న మొబైల్ యాప్‌లోని ఎమర్జెన్సీ బట్‌ను నొక్కితే పోలీసులకు సమాచారం వెళ్తుంది. ఈ సమాచారం కంట్రోల్ రూంతో పాటు సమీపంలోని పెట్రో మొబైల్ వాహనానికి, హాక్ఐలో నమోదు చేసుకున్న నెంబర్లకు వెళ్తుంది.

ఫోన్ చేయండి..
సాయంత్రం ఆరు దాటిన తర్వాత రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు ప్రయాణించే సమయంలో వాహనం చెడిపోయినా లేదా పంక్చరైనా సహాయం కోసం పోలీసులను ఆశ్రయించాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. నగరంలో పోలీసుల సహాయం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు లేదా రాచకొండ వాట్పాప్ నెంబరు 9490617111కు సమాచారం అందించవచ్చని చెప్పారు.
More From GoodReturns

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..

Hyderabad:హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మారుతున్న నగరం ముఖచిత్రం.. కొత్త ఫ్లైఓవర్లు ఇవే!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications