Farmer Registry: రైతులు ఆ పని చేయకుంటే.. పీఎం కిసాన్, రైతు భరోసా, యూరియా రాదు..!

ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. తెలంగాణలోని రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఎలాంటి ఆటంకం లేకుండా పొందాలంటే 'ఫార్మర్ రిజిస్ట్రీ' లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద రూపొందిస్తున్న ఈ డిజిటల్ గుర్తింపు కార్డు ద్వారా అర్హులైన నిజమైన అన్నదాతలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తో పాటు రైతు భరోసా, పంటల బీమా, రాయితీ ఎరువులు, విత్తనాలు, పంట రుణాల వంటి ప్రయోజనాలు నేరుగా చేకూరనున్నాయి.

భూమి ఉన్న ప్రతి రైతు తమ ఆధార్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, పట్టాదారు పాస్‌బుక్ వివరాలతో స్థానిక మీసేవ కేంద్రాల్లో లేదా గ్రామాల్లోని వ్యవసాయ విస్తరణాధికారుల (AEO) వద్ద ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అర్హులైన రైతులకు ఈ డిజిటల్ ఐడీని కేటాయించేందుకు గాను సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ ఎవరైనా రైతులు ఫార్మర్ రిజిస్ట్రేష్ చేసుకోకుంటే వెంటనే చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ ఐడీ లేకుంటే రైతులు నష్టపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Farmer

ఫార్మర్ ఐడీ లేకుంటే పంట నమోదు చేయడం కుదరదు. అలాగే కేంద్ర పీఎం కిసాన్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. రైతు భరోసా, యూరియా కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు దేనికైనా ఫార్మర్ ఐడీ అవసరం పడుతుందని వివరిస్తున్నారు. ఫార్మర్ ఐడీని కేవలం తెలంగాణలోనే కాదు.. దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ప్రతి రైతుకు ఒక ఐడీ ఇవ్వాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఐడీతో రైతులు ఏ పంటలు వేస్తున్నారు. వారికి రుణాలు వచ్చాయా లేదో కూడా చేక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అటు ఏపీలో దాదాపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఉంటే వెంటనే చేసుకోవాలి. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాక్ బుక్ తో మీ సేవ కేంద్రాల్లోకి వెళ్తే వారు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందు కోసం నామమాత్రం రుసుం వసూలు చేస్తారు. లేకుంటే మీ ఊరికి అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+