పన్ను చెల్లింపుదారులకు ఇండియా పోస్ట్ గుడ్‌న్యూస్. మీ దగ్గరలోని పోస్టాఫీస్ సేవా కేంద్రాల్లో(CSC) ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఇండియా పోస్ట్ ఇటీవల ప్రకటించింది. దీంతో ఐటీ రిటర్న్స్ మరింత సులభం కానున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలమంది వేతన జీవులు ఉన్నారు. వీరందరికీ ఇది ఎంతో ఊరట కలిగించే అంశం. సోషల్ మీడియా వేదిక అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ మేరకు ప్రకటించింది.
మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి చాలా దూరం వెళ్లవలసిన అవసరం లేదని, మీ సమీప పోస్టాఫీస్ CSC కౌంటర్‌లో ఐటీ రిటర్న్స్‌ను సులభంగా దాఖలు చేయవచ్చునని ఇండియా పోస్ట్ ప్రకటించింది. CSC అంటే కామన్ సర్వీసెస్ సెంటర్. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ఎలక్ట్రానిక్ సేవలు అందించేందుకు ఇవి యాక్సెస్ పాయింట్స్‌గా పని చేస్తాయి. ఈ సెంటర్ ద్వారా ప్రజలు వివిధ ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు, సమాచారం పొందవచ్చు.

పోస్టాఫీస్, బ్యాంకింగ్, బీమా సేవలు వంటి వివిధ ఆర్థిక సేవల కోసం దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ సీఎస్‌సీ కౌంటర్లు పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారత పౌరులకు వివిధ ఈ-సేవలను అందిస్తోంది. అయితే ఆన్‌లైన్‌లో రిటర్న్స్ దాఖలు చేసుకోగలిగేవారు కొత్త ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి లాగ్-ఇన్ కావడం ద్వారా ఐటీఆర్‌ను సమర్పించవచ్చు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications