కొత్త ఆదాయపు పన్ను: శాలరైడ్‌కు ఆప్షన్, వ్యాపారం ఉంటే మాత్రం..
ఇటీవలి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏడాదికి రూ.13 లక్షల ఆదాయం ఉన్నవారికి ఈ కొత్త విధానం ప్రయోజకరమని చెబుతున్నారు. అలాగే, పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేనివారికి కూడా లబ్ధి చేకూరుస్తుంది. కొత్త పన్ను విధానం ఉద్యోగులకు వెసులుబాటు. కానీ వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం కుదరదని చెబుతున్నారు.

నాన్ శాలరైడ్‌కు...
స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 లేని నాన్-శాలరైడ్‌కు కొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఏడాదికి రూ.9.5 లక్షలు సంపాదించే నాన్-శాలరైడ్‌కు, రూ.1.5 లక్షలు డిడక్షన్ పొందేవారికి ప్రయోజనకరం. తమ వార్షిక ఆదాయపు పన్నులో రూ.5,200 వరకు సేవ్ చేసుకోవచ్చును.

శాలరైడ్‌కు వెసులుబాటు.. వ్యాపారస్తులకు మాత్రం..
కేవలం వేతనం మీద మాత్రమే ఆధారపడే ఉద్యోగులకు కొత్త పన్ను విధానం లబ్ధి చేకూరుస్తుందని చెబుతున్నారు. పాత.. కొత్త పన్ను విధానాల్లో ఏది ఎందులో పన్ను తక్కువగా ఉంటే అందులోకి మారిపోవచ్చు. ఉద్యోగంతో పాటు వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఆ వెసులుబాటు లేదు. వీరు ఓసారి కొత్త విధానానికి మారిపోతే శాశ్వతంగా అందులోనే ఉండాలి.

ఏది ప్రయోజనమైతే..
ఇండివిడ్యువల్ ఇన్‌కం ట్యాక్స్ పేయర్స్.. వేతనజీవులు కొత్త లేదా పాత పన్ను విధానంలో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చునని, పాత విధానంలో మినహాయింపులు ఎక్కువగా ఉంటాయని, కొత్త విధానంలో తక్కువ స్లాబ్స్ కలిగి ఉంటాయని, ఎవరికి ఏది ప్రయోజనమో దానిని ఎంచుకోవచ్చునని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాకెస్స్ చైర్మన్ పీసీ మోడీ చెప్పారు.

వ్యాపారం నిలిచిపోతే..
వ్యాపారం అంటే ఎత్తుపల్లాలు ఉంటాయి. వ్యాపార ఆదాయం ఉన్న ఉద్యోగులు ఓసారి కొత్త విధానానికి మారితే ఇక శాశ్వత విధానంలోనే కొనసాగాల్సి ఉంటుందని చెబుతున్నప్పటకీ.. ఓ ఏడాది ఉన్న వ్యాపార ఆదాయం మరో ఏడాది ఉండకపోవచ్చు. వ్యాపార ఆదాయం లేని సంవత్సరానికి ఉద్యోగులు తమకు ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చునట.
ఇక కేవలం వృత్తి నిపుణులు అయితే వారు కొత్త లేదా పాత విధానంలోకి మారే అవకాశముందా స్పష్టత రావాల్సి ఉంది. వృత్తి నిపుణులు అంటే కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications