Tax Exemptions: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో అందరూ ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దృష్టి సారించారు. ఈ నెలాఖరు వరకే తుది గడువు ఉండటంతో త్వరపడుతున్నారు. సాధ్యమైనంత మేరకు ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు అని అందరికీ తెలిసిన విషయమే. దీనికి అదనంగా కొన్ని సెక్షన్లు వినియోగించి మరి కొంత ఎక్కువ మొత్తం పన్ను పోటు నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం NPS, వడ్డీ ఆదాయం, విరాళాలు, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ టెస్ట్స్ వంటి మార్గాలను ఉపయోగించుకునే వీలుంది.

నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50 వేల మేరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80C కింద సాధారణంగా పొందే 1.5 లక్షల ఎక్సమ్‌ప్షన్‌కు అదనం. ఇక్కడ సెక్షన్ 80CCD అనేది ఉపయోగపడుతుంది. దీనికి తోడు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లోని సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చే పదివేలకు పైగా వడ్డీ ఆదాయం పైనా 80TTA ద్వారా ట్యాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసే అవకాశం ఉంది.
ఇక జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం వెచ్చించే అమౌంట్ కూడా మినహాయింపుకు అర్హత కలిగినదే. అయితే 60 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులకు ఇది 25 వేలు మరియు సీనియర్ సిటిజన్లకు 50 వేలు బెనిఫిట్ పొందొచ్చు. ఆరోగ్య టెస్టుల కోసం వెచ్చించే మొత్తంలో 5 వేల వరకు 80D పరిధిలోకి వస్తుంది. చివరగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన పలు సంస్థలకు ఇచ్చే విరాళాల పైనా మినహాయింపు లభిస్తుంది.


Click it and Unblock the Notifications