Income Tax Notice: దేశంలో ప్రజలు ఆదాయపుపన్ను చట్టప్రకారం తమ ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐటీ శాఖ గతంలో మాదిరిగా లేదు. ప్రజలు చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్ గురించి అధికారులకు తెలుస్తోంది. ఏఐ సాంకేతికత ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను సైతం నిశితంగా అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చట్టప్రకారం పన్ను చెల్లించదగిన ఆదాయం ఉన్నప్పటికీ.. అలా చేయకపోతే పన్ను శాఖ చర్యలు చేపడుతుంది.
ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు వచ్చాక రూ.10 చెల్లించాలన్నా యూపీఐ వాడేస్తున్నాం. అందువల్ల చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అకౌంట్ అవుతుందనే విషయాన్ని ప్రజలు అస్సలు మర్చిపోకూడదు. ఈ క్రమంలో పన్ను శాఖ ప్రకారం ఏడాదికి బ్యాంకులో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ.10 లక్షలకు మించి ఖర్చు చేసినా బ్యాంకులు సదరు వ్యక్తుల వివరాలను పన్ను శాఖకు ఆటోమెటిక్‌గా అందిస్తుందని గుర్తుంచుకోవాలి. వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో చేసే డిపాజిట్లు, విత్‌డ్రాలను కూడా పన్ను శాఖ పర్యవేక్షిస్తుంది. అందువల్ల ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు అది సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. పరిమితులకు మించి డిపాజిట్లు చేపడితే పన్ను శాఖ నుంచి నోటీసు పంపుతుంది.

వ్యక్తులు ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలి. ఇదే క్రమంలో రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్ చేపట్టాలంటే అందుకు పాన్ కార్డ్ వివరాలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన వివరాలు పన్ను అధికారుల దృష్టికి వెళతాయని గుర్తుంచుకోండి. అలాగే ఖాతాలో రూ.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఆ వివరాలను పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.కోటి కంటే ఎక్కువ నగదు ఉపసంహరణపై TDS చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకుల్లో ఒకేసారి రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీ జరిగినా ఈ ఆదాయపు పన్ను నోటిఫికేషన్ వర్తిస్తుంది. నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్‌లో రూ.50,000 కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు లేదా విత్‌డ్రా చేసేటప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డును సమర్పించాలి. పాన్ కార్డ్ లేకుండా నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను నోటీసులు వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్యాంకుల్లోనే కాకుండా ఏదైనా షాపింగ్, ఆభరణాల కొనుగోలు వంటి చోట్ల సైతం రూ.50 వేలకు మించిన ట్రాన్సాక్షన్లపై కొనుగోలుదారులు తమ పాన్ వివరాలను తప్పక అందించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.


Click it and Unblock the Notifications