టెలికం రంగంలోకి అడుగుపెట్టిన మూడున్నరేళ్లలోనే అదరగొట్టిన రిలయన్స్ జియో.. ఇప్పుడు తన అతి చవకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ డేటాను నిలిపివేసింది. గత కొంతకాలంగా వివిధ రీఛార్జ్‌లపై టెల్కోలు ధరలు పెంచుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జియో నెట్ వర్క్‌లోని అతి తక్కువ ప్లాన్ రూ.98ని నిలిపివేసింది. ఈ ప్లాన్‌ను తమ వెబ్ సైట్ నుండి తొలగించింది. ఈ ధరను రూ.129గా నిర్ణయించింది. దీంతో జియో ఆఫర్లలో తక్కువ ప్లాన్ ఇదే అవుతుంది.

రూ.129 రీఛార్జ్ ప్రయోజనాలు ఇవి..
రూ.129తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటా, జియో నుండి జియోకు అపరిమిత ఉచిత కాల్స్, రోజుకు 300 ఎస్సెమ్మెస్‌లు ఉంటాయి. దీని కాల పరిమితి 28 రోజులు. ఇత నెట్ వర్క్స్‌కు కాల్ చేయాలంటే ఈ ప్లాన్‌తో పాటు అదనంగా టాపప్ ఓచర్ తప్పనిసరి.

థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ నుండి కూడా..
జియో వెబ్ సైట్ , జియో మై యాప్ నుండి రూ.98 ప్లాన్‌ను తొలగించారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్స్ పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే నుండి కూడా తొలగించారు. 28 రోజుల పాటు 2GB వచ్చే ఈ ప్లాన్‌ను చాలామంది కొనుగోలు చేసేవారు. తక్కువగా ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆఫర్‌గా ఉంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్..
జియో ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం రూ.999తో 84 రోజుల కాల పరిమితితో రోజుకు 3GB డేటా, జియో నుండి ఇతర నెట్ వర్క్స్‌కు 3వేల కాల్స్ ఉచితం, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. దీంతో పాటు రూ.599, రూ.399 ప్లాన్స్ ఉన్నాయి. వీటితో రోజుకు 2GB డేటా, 1.5GB డేటా ఉంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications