ITR refund status: ఆన్‌లైన్ ద్వారా ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
పన్ను చెల్లింపుదారులు అసలు పన్ను బాధ్యత బాధ్యత కంటే అదనపు మొత్తాన్ని చెల్లించినప్పుడు పన్ను రీఫండ్ అవుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఆ అదనంగా చెల్లించిన మొత్తాన్ని బ్యాంకు నిర్ణీత గడువులోగా వెనక్కి ఇస్తుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత ఆదాయపు పన్ను డిపార్టుమెంట్ వెరిఫై చేస్తుంది. వారు రీఫండ్‌కు అర్హులా కాదా అని నిర్ధారిస్తుంది. పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఈ-వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఐటీ శాఖ సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రాసెస్ చేస్తుంది. పన్ను రీఫండ్ కావడానికి ఈ-ధృవీకరణ తేదీ నుండి 25 రోజుల నుండి 60 రోజులు పడుతుంది.

పన్ను రీఫండ్
పన్ను చెల్లింపుదారుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా రీఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు ఐటీ శాఖ దీనిని ప్రాసెస్ చేస్తుంది. పన్ను చెల్లింపుదారు సెక్షన్ 143(1) సీపీసీ కింద ఓ సమాచారాన్ని అందుకుంటారు. ఇది పన్ను చెల్లింపుదారు స్వీకరించేందుకు అర్హత ఉన్న వాపసు మొత్తాన్ని నిర్ధారిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.87 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.67 లక్షల కోట్లకు పైగా పన్ను రీఫండ్ అయింది. ఇందులో రూ.28,704 కోట్లు అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 (మార్చి 2021తో) ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రీఫండ్స్ 1.48 కోట్లు ఉన్నాయి.

పన్ను రీఫండ్ స్టేటస్ ఇలా
పన్ను చెల్లింపుదారులు తమ పాన్ నెంబర్, వారి రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలనుకునే అసెస్‌మెంట్ సంవత్సరం గుర్తుంచుకోవాలి. ఆన్ లైన్ ద్వారా తనిఖీ చేయడానికి రెండు విభిన్న మార్గాలు ఉన్నాయి. ఒకటి కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్, రెండు ఎన్ఎస్‌డీఎల్ పోర్టల్.
ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా...
- మొదట ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
- యూజర్ ఐడీ (పాన్ నెంబర్), పాస్‌వర్డ్, క్యాప్చాను ఎంటర్ చేసి లాగ్-ఇన్ కావాలి.
- ఈ-ఫైల్ ట్యాబ్‌లోని ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. వ్యూ రిటర్న్/ఫామ్ పైన క్లిక్ చేయాలి.
- ఏ అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలనుకున్నారో ఎంచుకొని, సబ్‌మిట్ చేస్తే సంబంధిత రిటర్న్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అది స్క్రీన్ పైన కనిపిస్తుంది.

NSDL పోర్టల్ ద్వారా..
- NSDL పోర్టల్ ద్వారా కూడా రీఫండ్ ట్రాక్ చేసుకోవచ్చు.
- మొదట వెబ్ సైట్‌ను ఓపెన్ చేసి పాన్, ఆధార్, అసెస్‌మెంట్ ఇయర్ వివరాలు నింపాలి.
- వివరాలు సమర్పించాక తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
- ఆదాయపు పన్ను స్టేటస్ కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications