ITR filing:ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. 'జాట్‌పట్ ప్రాసెసింగ్' ప్రారంభం
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపించింది. మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు మరింత సులభతర ఐటీఆర్ ఫైలింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఆదాయపన్ను శాఖ. ఈ మేరకు జాట్‌పట్ ప్రాసెసింగ్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ఇబ్బంది లేకుండా త్వరితగతిన దాఖలు చేయడంలో ఇది సాయపడుతుంది.

ఎలా దాఖలు చేయాలో వీడియో
ITR-1, ITR-4 కోసం జాట్‌పట్ ప్రాసెసింగ్ ప్రారంభమైంది. జాట్‌పట్ ప్రాసెసింగ్ ద్వారా ఐటీఆర్ 1, ఐటీఆర్ 4ను ఎలా దాఖలు చేయాలో వివరించే ట్యూటోరియల్ వీడియోను ఆదాయ పన్ను శాఖ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఐటీ శాఖ విభాగం నిర్దేశించిన ఈ కింది ప్రమాణాలను నెరవేర్చిన వారు మాత్రమే దీనిని యాక్సెస్ చేయవచ్చు.

ఇలా చేస్తే...
ఐటీఆర్ ధృవీకరించడం, బ్యాంకు ఖాతాను ముందే ధృవీకరించడం, బకాయిలు లేకపోవడం, ఆదాయ వ్యత్యాసం లేకపోవడం, టీడీఎస్ లేదా చలాన్ అసమతుల్యత లేకపోవడం... తదితర ప్రమాణాలు నెరవేర్చిన వారు దీనిని యాక్సెస్ చేయవచ్చు.

గడువు పొడిగింపు
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దాదాపు రెండు నెలల క్రితం ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. 2019-20(అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
కరోనా కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు ట్యాక్స్ పేయర్స్ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) గడువును పొడిగించిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ ఫైలింగ్ తేదీ గడువును జనవరి 31, 2021 వరకు పొడిగించింది.


Click it and Unblock the Notifications