ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని తీసుకు వచ్చారు. కొత్త పన్ను విధానంతో పాటు పాతది కూడా అమలులో ఉంటుంది. ట్యాక్స్ పేయర్ తనకు ఇష్టమైన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఈ కొత్త పన్ను విధానంపై చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తున్నారు. అలాగే, పాత పన్ను విధానంతో లాభమా, కొత్త పన్ను విధానంతో లాభమా అని తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఈ-కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి మరిన్ని కథనాలు

ఏ విధానంలో పన్ను పోటు తగ్గుతుంది
పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాల్లో వ్యత్యాసాలను తెలుసుకునేలా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ శాఖ ఈ-కాలిక్యులేటర్‌ను తీసుకు వచ్చింది. గురువారం ప్రారంభించిన ఈ-కాలిక్యులేటర్ ద్వారా ఏ పన్ను విధానం ప్రయోజకరమని తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఐటీ చెల్లింపు కోసం కొత్త విధానం ఎంచుకోవాలా, పాతది ఎంచుకోవాలా.. ఏ విధానంలో పన్ను పోటు తగ్గుతుందే ఇట్టే తెలుసుకోవచ్చు.

ఇలా కాలిక్యులేటర్ ఉపయోగించాలి..
రెండు ఐటీ విధానాల్లో ఏది లాభదాయకమనే విషయం తెలుసుకునేందుకు www.incometax indiaefiling.gov.in లోకి లాగిన్ అయి ఈ-క్యాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులో తమ వయస్సు, వార్షిక స్థూల ఆదాయం, ఆదాయ వనరులు, అనుమతించిన మినహాయింపులు, తగ్గింపులు ఎంటర్ చేసి క్లిక్ చేయాలి.

కంప్యూటర్ మానిటర్‌పై తెలుస్తుంది
అన్నింటిని ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత పన్ను చెల్లింపు ఆదాయంపై పాత విధానం ప్రకారం ఎంత పన్ను పడనుంది... కొత్త విధానం ద్వారా ఎంత పడుతుందనే విషయం కంప్యూటర్ మానిటర్ పైన కనిపిస్తుంది.

వచ్చే ఏడాది నుండి..
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాత పన్ను విధానంతో పాటు కొత్త పన్ను విధానాన్ని తీసుకు వచ్చారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది అమలులోకి వస్తుంది. పాత విధానాన్ని ఎంచుకుంటే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో పాటు సెక్షన్ 80సీ కింద వివిధ పెట్టుబడుల్లో పెట్టే రూ.1.5 లక్షల పెట్టుబడులకు మినహాయింపు ఉంటుంది. కొత్త విధానం ఎంచుకుంటే మాత్రం ఈ ప్రయోజనాలు ఉండవు. అయితే ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేనివారికి ఇది ప్రయోజనకరం.


Click it and Unblock the Notifications