ఆన్‌లైన్ ఈ-టిక్కెటింగ్ సర్వీసెస్ సంస్థ అభిబస్‌తో ఇండియన్ రైల్వే కేటిరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) ఒప్పందం కుదుర్చుకుంది. IRCTC ప్లాట్ ఫాం పైన టిక్కెట్లను విక్రయించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా IRCTC ఖాతాదారులు లక్ష బస్సు రూట్లలో స్లీపర్/నాన్ స్లీపర్, ఏసీ/నాన్ ఏసీ బస్సుల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే టిక్కెట్లు లేకుంటే వెంటనే బస్సు లభ్యతను కస్టమర్లు చూసుకొని టిక్కెట్ కొనుగోలు చేయవచ్చు. ఏసీ, నాన్-ఏసీ బస్సు టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చినట్లు IRCTC వివరించింది.

వెయిటింగ్ లిస్ట్ అయితే..
IRCTC భాగస్వామ్యంతో తాము ఇంకా ఎక్కువమంది కస్టమర్లకు సేవలు అందించగలుగుతామని అభిబస్ తెలిపింది. IRCTCలో రైలు టికెట్ కోసం ప్రయత్నించినప్పుడు, వెయిటింగ్ లిస్ట్ ఉంటే, ప్రత్యామ్నాయంగా ఆ మార్గంలో అందుబాటులో ఉన్న బస్ సర్వీసుల్ని సులభంగా బుక్ చేసుకునే వెసులుబాటు కస్టమర్లకు లభిస్తుందని తెలిపారు.

లక్షలాది టిక్కెట్ల విక్రయం
IRCTC రోజుకు తొమ్మిది లక్షలకు పైగా ట్రెయిన్ టిక్కెట్స్ జారీ చేస్తుంది. అభిభస్ ఆన్‌లైన్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టం ప్రారంభించినప్పటి నుండి 45 మిలియన్ల కస్టమర్లకు సేవలు అందించింది. ఆ తర్వాత ఈ-టిక్కెటింగ్ ప్లాట్‌ఫామ్స్ అభిబస్ డాట్ కామ్, మొబైల్ యాప్స్‌ను ప్రారంభించింది. కస్టమర్లకు మరింత సులభంగా లభ్యమయ్యేలా IRCTC... అభిబస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

మరింతమంది కస్టమర్ల చెంతకు
IRCTCతో భాగస్వామ్యం ద్వారా తమకు మరింత వృద్ధికి, మరింతమంది కస్టమర్లకు చేరువయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని, IRCTC కస్టమర్లు ఇప్పుడు ఇబ్బందులు భారత అతిపెద్ద ఆన్ లైన్ బస్సు సర్వీసులకు అనుసంధానమై ఉంటారన అభిబస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శశాంక కూన తెలిపారు. వివిధ రవాణా సంస్థలతో అభిబస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో గత మూడు నెలలుగా రోజుకు 30000 వరకు బుకింగ్స్ చేస్తోంది.


Click it and Unblock the Notifications