న్యూఢిల్లీ: తత్కాల్ టిక్కెట్ బుకింగ్ స్కీం కింద ప్రయాణీకులకు చివరి నిమిషంలో టిక్కెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇండియన్ రైల్వే. తత్కాల్ టిక్కెట్‌ను రైల్వే యాప్ లేదా IRCTC వెబ్‌సైట్ లేదా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టిక్కెట్లను దేశంలోని ఏ భారతీయ రైల్వే రిజర్వేషన్ కేంద్రం నుంచి అయినా ఆఫ్ లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.

డిస్టెన్స్ ఆధారంగా తత్కాల్ టిక్కెట్
తత్కాల్ టిక్కెట్లు సాధారణ టిక్కెట్ల కంటే ఎక్కువ రేటు ఉంటుంది. ప్రీమియం ఛార్జీలు ఉంటాయి. టిక్కెట్లు సాధారణంగా స్టేషన్ నుంచి స్టేషన్‌కు ఇస్తారు. ఇక్కడ ధర కూడా స్టేషన్ నుంచి స్టేషన్ ప్రాతిపదికన ఉంటుంది. అదే తత్కాల్ టిక్కెట్ విషయానికి వస్తే టిక్కెట్ ప్రయాణపు దూరంపై ఆధారపడి ఉంటుంది. అందుకే దూరం నిబంధనలు తత్కాల్ టిక్కెట్లకు వర్తిస్తాయి.

తత్కాల్ టిక్కెట్ సమయం...
IRCTC టిక్కెట్ ఏజెంట్స్ లేదా వెబ్ ఏజెంట్స్ 10 am నుంచి 12 pm మధ్య తత్కాల్ టిక్కెట్లు ఇష్యూ చేస్తారు. ఈ టిక్కెట్ ఛార్జీ బేసిక్ ధరపై ఆధారపడి ఉంటుంది. సెకండ్ క్లాస్ టిక్కెట్‌కు తత్కాల్ ధర బేసిక్ ఫేర్‌లో పది శాతం ఎక్కువగా ఉంటుంది. ఇతర క్లాస్‌లకు 30 శాతం ఎక్కువ భారం పడుతుంది. దీనికి కూడా మినిమం, మాగ్జిమం ఛార్జీలు వర్తిస్తాయి.

ఏసీ క్లాస్ తరగతులకు 10 గంటలకు...
తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది ఏసీ క్లాస్ తరగతుల ప్రయాణ టిక్కెట్లకు వర్తిస్తుంది. ఇక నాన్ ఎసీ క్లాస్ తరగతి ప్రయాణానికి తత్కాల్ టిక్కెట్ బుకింగ్ టైమ్ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మీరు ప్రయాణం చేయాలని భావించే తేదీకి ఒకరోజు ముందు తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. రేపు ట్రైన్ బయలుదేరుతుంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు బుక్ చేసుకోవాలి.

PNR నెంబర్ కింద నలుగురు ప్రయాణీకులకే..
తత్కాల్ టిక్కెట్లు ఒక PNR నెంబర్ కింద కేవలం నలుగురు ప్రయాణీకులకు మాత్రమే బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. సాధారణ టిక్కెట్లు అయితే ఆరు బుక్ చేసుకోవచ్చు.

టిక్కెట్ క్యాన్సిల్ కాదు... కానీ
సాధారణ ట్రైన్ టిక్కెట్ల మాదిరిగా తత్కాల్ ట్రైన్ టిక్కెట్లను క్యాన్సిల్ చేయడం కుదరదు. అయితే రైలు మూడు గంటలకు పైన ఆలస్యం అయితే మాత్రం టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా రైలును మరో మార్గంలో డైవర్ట్ చేసినప్పుడు రీఫండ్ పొందవచ్చు.

తత్కాల్ మినిమం, మాగ్జిమం ఛార్జీలు...
రిజర్వ్ సెకండ్ సిట్టింగ్ (2S), స్లీపర్, ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ తత్కాల్ టిక్కెట్ ధరలు ఇలా....

తత్కాల్ మినిం, మాగ్జిమం ఛార్జీలు
సెకండ్ (సిట్టింగ్), స్లీపర్, ఏసీ చైర్ కారు, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఎగ్జిక్యూటివ్ తత్కాల్ ధరలు ఇలా...
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications