గత ఆర్థిక సంవత్సరం ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు దగ్గర పడింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తోంది. ఇప్పటికీ ఎవరైనా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే మరో ఐదు రోజులు గడువు మాత్రమే ఉంది. ఐటీ రిటర్న్స్ చివరి నిమిషంలో దాఖలు చేస్తే హడావుడి ఉంటుంది. కాబట్టి ముందుగానే దాఖలు చేయడం మంచిది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ఐటీ పోర్టల్‌కు సంబంధించి లాగ్-ఇన్ ఐడీ పాస్ వర్డ్ మరిచిపోయారా, అయితే మీ లాగ్-ఇన్ పాస్ వర్డ్‌ను సులభంగా రీసెట్ చేసుకోవచ్చు. ఇందుకు ఇలా చేయండి....

రెండు పద్ధతుల్లో...
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఆదాయపు పన్ను వెబ్ సైట్ ద్వారా మీరు పాత పాస్‌వర్డ్‌ను రికవరీ చేసుకోలేరు. మీరు కొత్త పాస్ వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు.. క్రియేట్ చేసుకోవచ్చు.
కొత్త పాస్ వర్డ్‌ను క్రియేట్ చేసిన తర్వాత దాంతో మీరు లాగ్-ఇన్ కావొచ్చు.
పాస్ వర్డ్‌ను రీసెట్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఇన్‌కం ట్యాక్స్ వెబ్ సైట్ ద్వారా, రెండు ఐటీ డిపార్టుమెంట్‌కు ఈ-మెయిల్ పంపించడం ద్వారా పాస్ వర్డ్ రీసెట్ చేయవచ్చు.

ఐటీ వెబ్ సైట్ ద్వారా...
ఆదాయపు పన్ను వెబ్ సైట్ ద్వారా పాస్ వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీరు మీ పాన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే కాప్చా కోడ్‌ను టైప్ చేయాలి.
ఆ తర్వాత సబ్‌మిట్ పైన క్లిక్ చేయాలి.
ఈ వివరాలు ఇచ్చిన తర్వాత మూడు మార్గాల్లో పాస్ వర్డ్ రికవరీ చేసుకోవచ్చు.
ఒకటి సీక్రెట్ క్వశ్చన్‌కు ఆన్సర్, రెండు డిజిటల్ సిగ్నేచర్ అప్ లోడ్, మూడు ఎంటర్ ఈ-ఫైల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్.

ఈ మూడింటి ద్వారా ఇలా...
- సీక్రెట్ క్వశ్చన్‌కు ఆన్సర్ ద్వారా...
సీక్రెట్ క్వశ్చన్‌కు ఆన్సర్‌ను ఎంచుకుంటే అప్పుడు మీ పుట్టిన తేదీని పేర్కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ సీక్రెట్ క్వశ్చన్ వచ్చిందో దానికి సమాధానం చెప్పాలి.
- డిజిటల్ సిగ్నేచర్‌ను మీరు ఇంతకుముందే ఇచ్చి ఉంటే, దీని ద్వారా కూడా రీసెట్ చేసుకోవచ్చు.
- గతంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే మీ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను పేర్కొనడం ద్వారా రీసెట్ చేసుకోవచ్చు. అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ అన్ని ఐటీ రిటర్న్స్‌లో పేర్కొనాలి.
ఒకవేళ రిటర్న్స్ లేకుంటే మీ మెయిల్ బాక్స్ నుండి సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ఎప్పుడు కూడా ఐటీఆర్-వీ కాపీనీ మీ మెయిల్ బాక్స్‌కు పంపిస్తుంది.

ఆధార్ కార్డు ద్వారా
- ఆధార్ కార్డును ఉపయోగించి పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవడానికి...మొదట ఈ-ఫైలింగ్ హోంపేజీలోకి లాగ్-ఇన్ కావాలి.
మీరు మీ యూజర్ ఐడీని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
లాగ్-ఇన్ స్క్రీన్ పైకి వెళ్లి సెక్యూర్డ్ యాక్సెస్ మెసేజ్ కింద్ ఫర్‌గట్ పాస్ వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఎంటర్ యూజర్ ఐడీ టెక్స్ట్ బాక్సులో మీ యూజర్ ఐడీని ఎంటర్ చేసి, తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
రీసెట్ పాస్ వర్డ్ పేజీ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ ఓటీపీ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
ఆధార్ కార్డు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆరు అంకెల ఓటీపీని టెక్స్ట్ బాక్సులో ఎంటర్ చేసి క్లిక్ చేయాలి.
ఓటీపీ టైప్ చేయడానికి మీకు మూడు అవకాశాలు మాత్రమే ఉంటాయి.
ఓటీపీ ఎక్స్‌పైర్ అయినప్పుడు ఓటీపీ ఎక్స్‌పైరీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓటీపీ ఎక్స్‌పైరీ అయితే మళ్లీ రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఓటీపీ సబ్‌మిట్ చేశాక, కొత్త పాస్ వర్డ్‌ను క్రియేట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
పాస్ వర్డ్ కనీసం ఎనిమిది క్యారెక్టర్ల నుండి 14 క్యారెక్టర్ల లోపు కొత్త పాస్ వర్డ్ ఉండాలి.

ఐటీ డిపార్టుమెంట్‌కు మెయిల్ పంపించడం ద్వారా...
ఆదాయపు పన్ను శాఖకు ఈ-మెయిల్ పంపించడం ద్వారా కూడా మీ పాస్ వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు. దిగువ పేర్కొన్న వివరాలతో పాస్ వర్డ్‌ను కోరవచ్చు.
పాన్ నెంబర్, ట్యాక్స్ పేయర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్/డేట్ ఆఫ్ ఇన్‌కార్పోరేషన్, ఫాదర్స్ నేమ్, మెయిలింగ్ అడ్రస్ అవసరం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications