FASTagను ఇంకా కొనుగోలు చేయలేదా? అయితే మీకో గుడ్‌న్యూస్! జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం FASTagను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉచితంగా పొందవచ్చు. ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ పదిహేను రోజుల పాటు కల్పిస్తోంది. ఎలక్ట్రానిక్ టోల్ విధానాన్ని మెరుగుపరచడం కోసం FASTagలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

రూ.100 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ మేరకు హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వీటిని NHAIలకు చెందిన టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపుల వద్ద ఉచితంగా పొందవచ్చు. వాహనదారులు పై ప్రాంతాల్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా FASTagలను తీసుకోవచ్చునని ప్రకటించింది. రూ.100 ఛార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.

డిపాజిట్, కనీస బ్యాలెన్స్ మాత్రం ఉండాలి
అయితే FASTag వ్యాలెట్‌కు వర్తించే సెక్యూరిటీ డిపాజిట్, కనీస బ్యాలెన్స్ విధానంలో మాత్రం మార్పు లేదని తెలిపింది. మరిన్ని వివరాల కోసం మైఫాస్టాగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా లేదా దగ్గరలోని కేంద్రానికి వెళ్లడం ద్వారా లేదా 1033 సహాయక బృందం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

RCని చూపించు తీసుకోవచ్చు
వాహన వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రే,న్ సర్టిఫికెట్ (RC)ని NHAI టోల్ ఫ్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపుల వంటి ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాయింట్ ఆఫ్ సేల్ వద్ద చూపించి FASTagను పొందవచ్చు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా కేంద్రం జనవరి 15, 2020 నుండి ఫాస్టాగ్ విధానాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫాస్టాగ్ వల్ల ప్రయాణీకులు టోల్ ప్లాజా వద్ద వేచి చూసే ఇబ్బందులు తప్పుతాయి. ఇంధన వాడకం తద్వారా కాలుష్యం తగ్గుతుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications