EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ వద్దకే రానున్న పీఎఫ్ అధికారులు..!

ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ ఖాతాలు దాదాపుగా ఉంటాయి. అయితే చాలా మంది పీఎఫ్ గురించి అవగాహన ఉండదు. కొంత మంది తమ పీఎఫ్ ఖాతాలో నామినీ, బ్యాంక్ ఖాతా నంబర్ కూడా అప్డేట్ చేయలేకపోతున్నారు. డబ్బులు విత్ డ్రా చేసుకోవడం చాలా మందికి తెలియదు. అలాగే చాలా మంది ఆధార్ అప్డేట్ చేస్తుంటారు. అప్డేట్ లో పుట్టిన తేదీ మారిన, పేరు మారనా పీఎఫ్ ఆఫీసులో పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అంతే కాకుండా పీఎఫ్ ఖాతాలో ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల సమస్యలను పరిష్కరించడానికి మీ వద్దకే పీఎఫ్ అధికారులను పంపనుంది.

ప్రతీ జిల్లాలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ఖాతాదారుల సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. పీఎఫ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నవారికి ఇది మంచి అవకాశంగా మారనుంది. ఈపీఎఫ్ఓ అక్టోబర్ 27వ తేదీన దేశవ్యాప్తంగా జిల్లాల్లో నిధి ఆప్కే నికాత్ 2.0 పేరుతో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపుల్లో అధికారులు అందుబాటులో ఉంటారని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్, ఈపీఎస్ కింద పెన్షన్, ఇన్యూరెస్ స్కీమ్ కింద జీవిత బీమాకు సంబంధించి వాటిల్లో ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడికక్కడే అధికారులు పరిష్కరిస్తారని పేర్కొంది. ఏ ఫిర్యాదుకైనా అక్కడిక్కడే పరిష్కారం దొరికేలా ప్రయత్నిస్తామని తెలిపింది.

PF

దీని వల్ల ఉద్యోగులు పీఎఫ్ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వివరించింది. ఈ శిబిరాల్లో మీరు ఈపీఎఫ్ఓ అధికారులను నేరుగా సంప్రదించి మీ సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. పీఎఫ్ సేవలకు సంబంధించి మీ సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ క్యాంపుల్లో సేవా, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పీఎఫ్ అధికారులను నేరుగా కలిసి వారితో మాట్లాడుకోవచ్చు. పీఎఫ్ ప్రయోజనాల గురించి ఖాతాదారులకు అధికారులు వివరిస్తారని ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం ఉద్యోగులకే కాకుండా పీఎఫ్ పెన్షనర్లు, యాజమాన్యాల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంతో పాటు ఇతర సేవలు ఈ సందర్భంగా అందుబాటులోకి రానున్నాయి. ఇక కంపెనీలు కూడా పీఎఫ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొంటున్నారు. విశ్వాస్ 2026 పథకం కింద కంపెనీలు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ నష్ట కేసులను పరిష్కరించుకోవచ్చని కూడా పీఎఫ్ సంస్థ పేర్కొంది. ఆన్ లైన్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా నేరుగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ క్యాంపులు ఉపయోగపడనున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+