కరోనా మహమ్మారి దెబ్బకు క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 244 శాతం నుండి 300 శాతం తగ్గాయి. చమురు ధరలు జీరో కంటే దిగువకు దిగజారాయి. అమెరికా బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ క్రూడ్ బ్యారెల్‌కు మైనస్ 37.63 డాలర్లు పలకడం గమనార్హం. రికార్డ్ క్రాష్ అనంతరం కాస్త కోలుకొని మే డెలివరీ బ్యారెల్ 1.10 డాలర్లు పలికింది. చమురు ధరలు మైనస్‌లోకి వెళ్లిపోయాయంటే ఇండియన్స్ లేదా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు పెట్రోల్, డీజిల్‌కు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదా? తెలుసుకుందాం..

చమురు ధర మైనస్‌లోకి వెళ్లడం అంటే..
యూఎస్ వెస్ట్ టెక్సాస్ క్రూడ్ ఫ్యూచర్ మే కాంట్రాక్ట్ ధర మైనస్ 36 డాలర్లు పలికింది. ఇది ఫ్యూచర్ మార్కెట్ ధర. ఫ్యూచర్ మార్కెట్లో గడువుకు ముందే ఒప్పందాన్ని సెటిల్ చేసుకోవాలి. మే కాంట్రాక్ట్ గడువు ముగింపుకు సోమవారం చివరి రోజు. ఈ ఒప్పందం కలిగి ఉన్న చాలామంది పెట్టుబడిదారుల ఆందోళన ఏమిటంటే స్టోరేజ్‌కు స్థలం లేదు. అలాంటప్పుడు ఇక్కడ స్టోరేజ్‌కు చెల్లించడం కంటే కాంట్రాక్ట్ కోసం ఇన్వెస్టర్లకు చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ముడి చమురు ధర ప్రతికూలంగా మారింది. అంటే ఇక్కడ ఉత్పత్తిదారు లేదా విక్రయించే వారు.. కొనుగోలుదారుడు చమురును కొనుగోలు చేసేందుకు చెల్లించారు. ఫ్యూచర్ మార్కెట్ భిన్నంగా ఉంటుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు మన వద్ద నెగిటివ్‌లోకి వెళ్తుందా?
పెట్రోల్, డీజిల్ ధరలు కచ్చితంగా నెగిటివ్‌లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇక్కడ లెక్కలు భిన్నంగా ఉంటాయి. చమురు ధరలు ఎంతకు వచ్చినప్పటికీ ఆ చమురు మన దేశం రావడానికి భారతీయ చమురు కంపెనీలు ఇండియన్ ఆిల్, BPCL, HPCL మొదలగునవి కొనుగోలు చేస్తాయి. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎప్ తదితర వాటిలోకి శుద్ధి చేస్తాయి.

ధరలు ఇలా..
ప్రస్తుతం ఇండియన్ క్రూడా బాస్కెట్ ధర బ్యారెల్‌కు 33 డాలర్లు ఉంది. ఇది సగటు దుబాయ్, ఒమన్, బ్రెంట్ క్రూడాయిల్ ధరలు. ప్రభుత్వం ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని ధరలు ఫైనలైజ్ చేస్తుంది. వివిధ సూచీలను పరిశీలిస్తుంది. ఇవి కాకుండా ఇతర ఖర్చులు ఉంటాయి. ఉత్పత్తి కేంద్రాల నుండి మన సంస్థలు కొనడం నుండి, అక్కడ శుద్ధి చేయడం మొదలు రిటైల్ పెట్రోల్ పంపుల వరకు రావడానికి అయ్యే ఖర్చులు ఇలా ఉంటాయి...

ఈ ఖర్చులు ఉంటాయి
రిటైల్ పంపుల వరకు వచ్చే ఖర్చులు చూస్తే.. 1. క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకున్న తర్వాత శుద్ధి చేయడానికి ఖర్చు అవుతుంది. 2. ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ, 3. డీలర్ కమిషన్, 4.వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇవన్నీ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్, వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెరిగి పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయి. అంటే రాష్ట్రాలను బట్టి కూడా పెట్రో ధరల్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుంది.

వీటిని తప్పించుకునే అవకాశం లేదు
పైన చెప్పిన ఖర్చులను వాహన వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోను తగ్గించుకునే అవకాశం లేదు. కాస్త ధరలు అటు ఇటు పెరగడం తప్ప ఖర్చులు మాత్రం ఖాయం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయినప్పుడల్లా అదనపు ఆదాయం సమకూరేందుకు ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతాయి కూడా. ప్రస్తుతానికి దేశమంతా లాక్ డౌన్‌లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు. మే 3వ తేదీ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉంటుందో చూడాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Strait of Hormuz: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్.. చమురు సంక్షోభం నుంచి భారత్ సేఫ్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications