ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వరుసగా 4 లాంగ్ వీకెండ్స్, 17 హాలిడేస్.. 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా ఇదే..
Central Government Holiday List 2027: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2027 సంవత్సరానికి సంబంధించిన అధికారిక సెలవుల క్యాలెండర్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) విడుదల చేసింది. జులై 2026 మెమోరాండం ప్రకారం విడుదలైన ఈ జాబితాలో తప్పనిసరి సెలవులు (Gazetted Holidays), ఐచ్ఛిక సెలవులు (Optional Holidays), పరిమిత సెలవుల (Restricted Holidays) వివరాలను స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారం ఢిల్లీ, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 17 తప్పనిసరి సెలవులు ఉంటాయి. వీటికి అదనంగా ఉద్యోగులు పరిమిత సెలవుల జాబితా నుండి మరో రెండు సెలవులను ఎంచుకోవచ్చు. ఇక ఢిల్లీ వెలుపల దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 14 తప్పనిసరి సెలవులను పాటించడంతో పాటు.. 12 ఐచ్ఛిక సెలవుల జాబితా నుండి మూడు సెలవులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.

రాబోయే 2027 సంవత్సరంలో శుక్రవారం లేదా సోమవారం నాడు పండుగలు రావడంతో ఉద్యోగులకు సహజంగానే మూడు రోజుల నిడివి గల నాలుగు సుదీర్ఘ వారాంతాలు (Long Weekends) లభిస్తున్నాయి. తప్పనిసరి సెలవుల జాబితాలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం (మంగళవారం), మార్చి 10న ఈద్-ఉల్-ఫితర్ (బుధవారం), మార్చి 26న గుడ్ ఫ్రైడే (శుక్రవారం), ఏప్రిల్ 19న మహావీర్ జయంతి (సోమవారం), మే 17న ఈద్-ఉల్-జుహా/బక్రీద్ (సోమవారం), మే 20న బుద్ధ పూర్ణిమ (గురువారం), జూన్ 16న మొహర్రం (బుధవారం) ఉన్నాయి. అయితే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం మరియు ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు (ఈద్-ఎ-మిలాద్) రెండూ ఆదివారం నాడే రాగా, అక్టోబర్ 2న గాంధీ జయంతి (శనివారం), అక్టోబర్ 9న దసరా/విజయదశమి (శనివారం), అక్టోబర్ 29న దీపావళి (శుక్రవారం), నవంబర్ 14న గురునానక్ జయంతి (ఆదివారం), డిసెంబర్ 25న క్రిస్మస్ (శనివారం) ఉన్నాయి. వీటికి అదనంగా ఢిల్లీ, న్యూఢిల్లీ కార్యాలయాలకు మార్చి 23న హోలీ (మంగళవారం), ఏప్రిల్ 15న రామ నవమి (గురువారం) సహా మొత్తం 17 తప్పనిసరి సెలవులు వర్తిస్తాయి.
దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల కార్యాలయాల కోసం ప్రకటించిన 12 ఐచ్ఛిక సెలవుల జాబితాలో దసరాకు అదనపు రోజు, హోలీ, జన్మాష్టమి (వైష్ణవ), రామ నవమి, మహా శివరాత్రి, వినాయక చతుర్థి, మకర సంక్రాంతి/పొంగల్, రథయాత్ర, ఓనం, బసంత్ పంచమి, ఉగాది/గుడి పడవ/వైశాఖి/విషు/బిహు, ఛత్ పూజ మరియు కర్వా చౌత్ వంటి ప్రాంతీయ పండుగలు ఉన్నాయి. అదేవిధంగా పరిమిత సెలవుల (RH) జాబితాలో జనవరి 1న నూతన సంవత్సర దినోత్సవం, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 15న పొంగల్/గురు గోవింద్ సింగ్ జయంతి, మార్చి 22న హోలికా దహన్, ఏప్రిల్ 7న ఉగాది, ఆగస్టు 17న రక్షా బంధన్, సెప్టెంబర్ 4న వినాయక చతుర్థి, అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో దసరా (సప్తమి, మహాష్టమి, మహానవమి), అక్టోబర్ 28న నరక చతుర్దశి, అక్టోబర్ 30న గోవర్ధన్ పూజ, నవంబర్ 4న ఛత్ పూజ, డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ వంటి 30కి పైగా పర్వదినాలను చేర్చారు.
ప్రయాణాలు, విహారయాత్రలకు ప్రణాళికలు వేసుకునే ఉద్యోగులకు 2027 క్యాలెండర్ అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. గుడ్ ఫ్రైడే (మార్చి 26 - శుక్రవారం), మహావీర్ జయంతి (ఏప్రిల్ 19 - సోమవారం), బక్రీద్ (మే 17 - సోమవారం), దీపావళి (అక్టోబర్ 29 - శుక్రవారం) నేరుగా వారాంతాలతో కలిసి వస్తున్నాయి. వీటికి తోడు కొద్దిపాటి ప్లానింగ్‌తో ఒక్క రోజు సెలవు పెడితే మరిన్ని సుదీర్ఘ సెలవులను పొందవచ్చు.
ఉదాహరణకు జనవరి 25 (సోమవారం) సెలవు తీసుకుంటే గణతంత్ర దినోత్సవంతో కలిపి జనవరి 23 నుండి 26 వరకు నాలుగు రోజులు, మార్చి 22 (సోమవారం) హోలికా దహన్ సెలవు ఎంచుకుంటే హోలీతో కలిపి మార్చి 20 నుండి 23 వరకు నాలుగు రోజులు, ఏప్రిల్ 16 (శుక్రవారం) సెలవు పెడితే రామ నవమి, మహావీర్ జయంతి మధ్య ఏప్రిల్ 15 నుండి 19 వరకు ఏకంగా ఐదు రోజులు, అలాగే మే 21 (శుక్రవారం) సెలవు తీసుకుంటే బుద్ధ పూర్ణిమతో కలిపి మే 20 నుండి 23 వరకు మరో నాలుగు రోజుల సుదీర్ఘ విరామాన్ని ఉద్యోగులు ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications
