Bank Holiday: డిసెంబర్ 3న బ్యాంకులు బంద్.. సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు..
డిసెంబర్ 3న గురువారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు బ్యాంకుల యూనియన్ పిలుపునిచ్చింది. AIBEA,AIBOA, BEFI బ్యానర్ కింద అన్ని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఈ నిరసనల్లో పాల్గొననున్నట్లు ప్రకటించింది. బ్యాంకును విదేశీ పెట్టుబడిదారునికి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ AIBEA, AIBOA, BEFI ఉద్యోగ సంఘాలు నిరసనలు పిలుపునిచ్చాయి. దీంతో ఆ రోజు బ్యాంక్ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఆ రోజు బ్యాంకుల వినియోగదారులపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ప్రభుత్వం, ఎల్ఐసీ కలిపి ఐడీబీఐ బ్యాంకులో 94 శాతం వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
60 శాతం వాటాను విదేశీ సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌కు విక్రయించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఫెయిర్‌ఫాక్స్ ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రమోటర్ కంపెనీగా మారే అవకాశం ఉంది. దీనిని ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు వ్యతిరేకిస్తుడగా.. వారికి బ్యాంకింగ్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. గతంలోనే ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టగా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు మరోసారి సమ్మెకు చేయనున్నారు. వారికి ఇతర బ్యాంక్ ఉద్యోగులు కూడా మద్దతు ప్రకటించాయి. ఐడీబీఐ బ్యాంకులో సుమారు రూ. 3.50 లక్షల కోట్ల మొత్తం డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రూ. 2.50 లక్షల కోట్ల అడ్వాన్సులు కూడా ఉన్నాయి.

బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ. 6 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ బ్యాంకును ఫెయిర్‌ఫాక్స్‌కు అమ్మితే ఈ స్వదేశీ బ్యాంకు విదేశీ బ్యాంకుగా మారిపోతుదంని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బ్యాంకును ఒక విదేశీ పెట్టుబడిదారునికి అమ్మాలనే ఈ నిర్ణయం పూర్తిగా సరైంది కాదని బ్యాంకు సంఘాలు వాదిస్తున్నాయి. గతంలో పలు లోపాల కారణంగా అనేక ప్రైవేట్ బ్యాంకులు మూతపడ్డాయని గుర్తు చేస్తున్నాయి. విఫలమైన ఈ ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ ఆ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయని పేర్కొంటున్నారు.
మన బ్యాంకులను ప్రైవేట్, విదేశీ పెట్టుబడులకు కాకుండా మన ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ జాతీయం చేయాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నాయి. మన బ్యాంకులను ప్రైవేట్ చేతులకు అమ్మడం అంటే ప్రజల భారీ పొదుపును ప్రైవేట్ చేతులకు అప్పగించడమేనని ఆరోపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయం మారలేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications