ఈ ఏడాది జూలై నుంచి భూటాన్ పర్యటనకు వెళ్లే భారత పర్యాటకులకు అలర్ట్! భూటాన్ దిగువ సభ సోమవారం ఓ చట్టానికి ఆమోదం తెలిపింది. తమ దేశ సుస్థిర అభివృద్ధి కోసం భారత్‌తో పాటు బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి వచ్చే పర్యాటకులు రోజుకు రూ.1,200 చెల్లించాలనే చట్టానికి దిగువ సభ ఆమోదం తెలిపింది.

పర్యావరణానికి ప్రాధాన్యత.. అందుకే
తమ దేశ సుస్థిర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిమాలయన్ కింగ్‌డమ్ భూటాన్ పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే భారత్ సహా పై దేశాల నుంచి పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. దీంతో రోజుకు రూ.1200 చెల్లించాలనే నిర్ణయాన్ని తీసుకుంది.

పర్యాటకులు రోజు రోజుకు పెరుగుతుండటంతో..
పైమూడు దేశాల నుంచి భూటాన్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకుముందు ఏడాది కంటే 2019లో 10 శాతం మేర పెరిగింది. ఈ బిల్లు భూటాన్ నేషనల్ అసెంబ్లీలో కూడా ఇంకా చర్చల్లో ఉంది. అయితే ఈ ఫీజు నామమాత్రమే పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.

రూ.18,000 చెల్లిస్తున్న అంతర్జాతీయ పర్యాటకులు
ప్రస్తుతం అంతర్జాతీయ పర్యాటకులు ప్రతిరోజు 250 డాలర్లు (దాదాపు రూ.18,000) చెల్లిస్తున్నారు. 250 డాలర్లలో 65 డాలర్లు సుస్థిర అభివృద్ధి ఫీజు కింద వసూలు చేస్తున్నారు. 40 డాలర్లు వీసా ఛార్జీగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి వెళ్లే పర్యాటకులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత చట్టం జూలై నుంచి అమలైతే భారతీయులు సుస్థిర అభివృద్ధి ఫీజు, పర్మిట్ ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత చెల్లించాల్సి ఉంటుంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications